Srikanth : హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పలకరించాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తూ తెగ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై స్పందించాడు. తమ్మారెడ్డి.. శ్రీకాంత్ ని సినిమా హీరోలంటే హీరోయిన్లతో ఎఫైర్లు ఉంటాయని అంటారు కదా. పెళ్లికి ముందు నీకు ఎంతమందితో ఎఫైర్ ఉంది అని అడగడంతో తనకు ఎంత మందితో ఎఫైర్స్ ఉన్నాయనేది మీకు తెలుసు. మీ దృష్టికి వచ్చినప్పుడు అడగండి. బయట రాసింది అడగడం కాదు అని శ్రీకాంత్ అన్నారు.
నువ్వు మంచోడివే అని నాకు తెలుసు కాని బయట ఏదో అనుకుంటున్నారు అని తమ్మారెడ్డి అనగా, బయట వాళ్లు ఏదో అనుకుంటే నేను పట్టించుకోను. అప్పుడు రాశి నేను ఏదో ఫంక్షన్‌కి వెళితే ఏదేదో అన్నారు అని శ్రీకాంత్ అన్నాడు. దానికి తమ్మారెడ్డి.. “అవునూ.. నిన్ను పిచ్చకొట్టుడు కొడుతుంది ఏంటీ” అని నవ్వుతూ అడిగారు.దానికి సమాధానంగా మేం ఇద్దరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాం. చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అక్కడికి వచ్చిన ఈ హీరోయిన్ రాశీని చూసి రాశి అమ్మా అని అనడంతో నాకు నవ్వు వచ్చింది. అప్పుడే అమ్మని చేశారా అని నేను కూడా రాశి అమ్మ అని అన్నాను. దాంతో సరదగా కొట్టింది.
అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏం లేదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేశాను. నాకు ఎఫైర్స్‌పై అంత ఆసక్తి లేదు అని శ్రీకాంత్ అన్నారు. ఇక నేను నటించిన వాళ్లలో సౌందర్య, రాశీతో అలా చాలామందితో కంఫర్ట్‌గా ఉండేది. నా కోస్టార్స్ మా ఇంటికి సరదాగా వచ్చేవారు. మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉండేది. ఇక ఊహాకి నాకు విడాకులు అయ్యాయంటూ ఎన్నో ప్రచారాలు సాగాయి. మేం అరుణాచలం వెళ్తుంటే మా విడాకుల వార్త చూసి షాక్ అయ్యాం. తర్వాత ఆ వార్తలను ఖండించాం అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఇక శ్రీకాంత్ తనయుడు కూడా హీరోగా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…