Skanda Movie Mistake : స్కంద సినిమాలో ఇంత పెద్ద పొర‌పాటా.. బోయ‌పాటిని ఆడుకుంటున్న నెటిజ‌న్లు..

November 3, 2023 10:05 PM

Skanda Movie Mistake : బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రామ్ పోతినేని హీరోగా స్కంద సినిమా రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాలో, శ్రీలీల, రామ్ సరసన నటించారు. ప్రమోషన్ల టైంలోనే సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ ని బాగా పెంచేశారు. దీంతో, ఆడియన్స్ అందరూ కూడా సినిమా మీద హోప్స్ పెట్టుకొని, ఎదురు చూశారు. ఈ సినిమా కేవలం, తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. తాజాగా, రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమాలో జరిగిన తప్పు గురించి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

బోయపాటి శ్రీను సినిమా అంటే, తెలుగు ఆడియన్స్ కి ఒక అవగాహన ఉంటుంది. సినిమాలో లాజిక్ ఉండడం మామూలే. అయితే, బోయపాటి సినిమాలో లాజిక్ అతిగా ఉంటుందని, టాక్ కూడా ఉంది. కథ, క్యారెక్టర్లు, సీన్స్ ఇలా అన్నిట్లో కూడా లాజిక్స్ ఉండవని అంటారు. ఆయన మూవీస్ లో యాక్షన్ సీన్స్ మరీ విడ్డూరంగా ఉంటాయని కూడా అంటుంటారు. స్కంద సినిమాలో రామ్ మాస్ పాత్ర చేశారు. ఇంతకుముందు కూడా రామ్ మాస్ రోల్స్ చేశారు.

Skanda Movie Mistake have you identified it
Skanda Movie Mistake

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా రామ్ మాస్ పాత్ర చేసారు. స్కంద సినిమాలో నెక్స్ట్ లెవెల్ మాస్ పాత్ర చేశారని టాక్ వచ్చింది. అయితే లాజిక్ లెస్ గా ఉందని అంతా అన్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ పైన ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఒక ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లడమే చాలా కష్టం.

అలాంటిది, తెలంగాణలోని ఒక పల్లెటూరులో ఉండే సాధారణ కుర్రాడు, ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న సెక్యూరిటీ మొత్తాన్ని కొట్టేసి, సీఎం ఇంట్లోకి వెళ్లిపోవడం, ముఖ్యమంత్రి కూతురులని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం వంటి సీన్లు ఉండడంతో, భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సన్నివేశం తీసేటప్పుడు చూసుకోవచ్చు కదా డైరెక్టర్ గారు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now