Siri Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 5లో చిరుతలా గేమ్ ఆడిన లేడీ కంటెస్టెంట్ సిరి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎలిమినేట్ అయింది. అందరూ అనుకున్నట్టుగానే టాప్ 5కి చేరిన సిరి హనుమంత్ ఐదో స్థానంతో సరి పెట్టుకుంది. రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌లను బిగ్ బాస్ హౌస్‌లోకి నాగార్జున పంపించారు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫొటోలతో హౌస్‌లోకి ఐదు డ్రోన్ కెమెరాలు పంపించారు. అందులో నుంచి ఎవరి ఫొటో ఉన్న డ్రోన్ కెమెరా బయటకు వెళ్తే వాళ్లు ఎలిమినేట్ అయినట్టని చెప్పాడు దేవి శ్రీప్రసాద్.
అయితే గాల్లో నుంచి సిరి ఫొటో ఉన్న డ్రోన్ ఎగిరిపోవడంతో సిరిని తీసుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేశారు. 19 మందితో పోరాడి.. టాప్ 5కి రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇది నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అని చెప్పింది. దీంతో హౌస్‌లో ఎవర్నైనా సాధించావా? అని నాగార్జున అడగడంతో సిరి తెగ సిగ్గు పడిపోయింది.. నేను సీరియస్‌గానే అడుగుతున్నా చెప్పమ్మా.. అని నాగ్ అడగడంతో.. ఇంకెవరు సార్, షణ్ముఖ్.. అని సిగ్గులేకుండా చెప్పింది.
గొడవైనా, ప్రేమైనా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి మరీ ఆడింది ఈ పటాకా. కాకపోతే ఎక్కువగా ప్రేమను షణ్ముఖ్‌కు, కోపాన్ని సన్నీకి పంచిపెట్టింది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌తోపాటు సీరియళ్లలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి వారానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రూపాయల మేర ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిరి పదిహేను వారాలకు గాను సుమారుగా రూ.25 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…