గురువారం, జూన్ 11, 2026
వినోదం

Siri Bigg Boss : బిగ్‌ బాస్‌లో 15 వారాలు ఉన్న సిరి ఎంత మొత్తం పారితోషికం అందుకుందో తెలుసా ?

Siri Bigg Boss : బిగ్ బాస్ సీజ‌న్ 5లో చిరుతలా గేమ్ ఆడిన లేడీ కంటెస్టెంట్ సిరి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎలిమినేట్ అయింది. అంద‌రూ అనుకున్నట్టుగానే టాప్ 5కి చేరిన సిరి హనుమంత్ ఐదో…

Siri Bigg Boss : బిగ్‌ బాస్‌లో 15 వారాలు ఉన్న సిరి ఎంత మొత్తం పారితోషికం అందుకుందో తెలుసా ?

Siri Bigg Boss : బిగ్ బాస్ సీజ‌న్ 5లో చిరుతలా గేమ్ ఆడిన లేడీ కంటెస్టెంట్ సిరి టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ముందుగా ఎలిమినేట్ అయింది. అంద‌రూ అనుకున్నట్టుగానే టాప్ 5కి చేరిన సిరి హనుమంత్ ఐదో స్థానంతో స‌రి పెట్టుకుంది. రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌లను బిగ్ బాస్ హౌస్‌లోకి నాగార్జున పంపించారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌ ఫొటోలతో హౌస్‌లోకి ఐదు డ్రోన్ కెమెరాలు పంపించారు. అందులో నుంచి ఎవరి ఫొటో ఉన్న డ్రోన్ కెమెరా బయటకు వెళ్తే వాళ్లు ఎలిమినేట్ అయినట్టని చెప్పాడు దేవి శ్రీప్రసాద్.

Siri Bigg Boss house do you know how much remuneration she got

అయితే గాల్లో నుంచి సిరి ఫొటో ఉన్న డ్రోన్ ఎగిరిపోవడంతో సిరిని తీసుకుని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చేశారు. 19 మందితో పోరాడి.. టాప్ 5కి రావడం చాలా హ్యాపీగా ఉంది.. ఇది నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అని చెప్పింది. దీంతో హౌస్‌లో ఎవర్నైనా సాధించావా? అని నాగార్జున అడగడంతో సిరి తెగ సిగ్గు పడిపోయింది.. నేను సీరియస్‌గానే అడుగుతున్నా చెప్పమ్మా.. అని నాగ్ అడగడంతో.. ఇంకెవరు సార్, షణ్ముఖ్.. అని సిగ్గులేకుండా చెప్పింది.

గొడవైనా, ప్రేమైనా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి మరీ ఆడింది ఈ పటాకా. కాకపోతే ఎక్కువగా ప్రేమను షణ్ముఖ్‌కు, కోపాన్ని సన్నీకి పంచిపెట్టింది. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌తోపాటు సీరియళ్లలోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి వారానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రూపాయల మేర ఇస్తామని ముందుగానే డీల్‌ కుదుర్చుకున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిరి పదిహేను వారాలకు గాను సుమారుగా రూ.25 లక్షల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి