గురువారం, జూన్ 11, 2026
వినోదం

Shanmukh: ష‌ణ్ముఖ్ హీరోగా సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న నిర్మాత‌లు

Shanmukh : బిగ్ బాస్ షోతో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఒక‌రు. ఆయ‌న యూట్యూబ‌ర్‌గా ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మొదలయ్యే ముందు ఈయన నటించిన సూర్య వెబ్…

Shanmukh: ష‌ణ్ముఖ్ హీరోగా సినిమాలు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న నిర్మాత‌లు

Shanmukh : బిగ్ బాస్ షోతో క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఒక‌రు. ఆయ‌న యూట్యూబ‌ర్‌గా ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ మొదలయ్యే ముందు ఈయన నటించిన సూర్య వెబ్ సిరీస్ సంచలనం రేపింది. దానికి ముందు సాఫ్ట్‌వేర్ డెవలవ్‌పర్ కూడా రచ్చ చేసింది. ఈ రెండింటికి మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీటితో షణ్ముఖ్ రేంజ్ మారిపోయింది.

producers are preparing movies to give hero offer to Shanmukh

బిగ్ బాస్ షోకి వ‌చ్చాక ష‌ణ్ముఖ్ క్రేజ్ మ‌రింత పెరిగింది. టైటిల్ ఫేవరెట్ కంటెండర్‌గా వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ టాస్కు నుంచి ఇంట్లో పలు సంఘటనలు హైలైట్ అయినా అతడు పెద్దగా కనిపించలేదు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. కామ్‌గా ఉంటూనే పదునైన ప్లాన్లు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరీ ముఖ్యంగా టాస్కుల్లో వందకు వంద శాతం మానసికంగా, శారీరకంగా శ్రమిస్తున్నాడు.

టాప్ 2లో అత‌డు త‌ప్ప‌క ఉంటాడ‌ని జోస్యాలు చెబుతున్నారు. అయితే వెండితెర‌పై ర‌చ్చ చేయాల‌నేది ష‌ణ్ముఖ్ క‌ల‌. బిగ్ బాస్ 5 తెలుగులో రప్ఫాడిస్తున్న ఈ కుర్రాడికి ఇప్పుడు హీరోగా ఆఫర్ కూడా వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినా కూడా చిన్న పాత్రలు కావడంతో నో చెప్పాడు. యూ ట్యూబ్‌లో తనను తాను నిరూపించుకున్న తర్వాతే సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేయాలనుకున్నాడు. ఇప్పుడు ష‌ణ్ముఖ్ హీరోగా ప‌లువురు నిర్మాత‌లు సినిమాలు చేసే ప్లాన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి యూట్యూబ్‌లో అద‌ర‌గొట్టిన ష‌ణ్ముఖ్‌.. వెండితెర‌పై ఎలా అద‌ర‌గొడ‌తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి