Deepthi Sunaina : లవ్‌ బర్డ్స్‌ దీప్తి సునైన, షణ్ముఖ్‌లు మళ్లీ కలవనున్నారట..? ఆ రోజునే ముహుర్తం..?

February 2, 2022 2:42 PM

Deepthi Sunaina : బిగ్‌ బాస్‌ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు.. దీప్తి సునైన, షణ్ముఖ్‌.. గత బిగ్‌ బాస్‌ సీజన్‌లో విన్నర్‌ కన్నా రన్నరప్‌ అయిన షణ్ముఖ్‌ కే పాపులారిటీ ఎక్కువ వచ్చింది. కారణం.. షోలో సిరితో కలిసి చేసిన రచ్చే అని చెప్పవచ్చు. షో ముగిశాక కొన్ని రోజులకు దీప్తి సునైన, షణ్ముఖ్‌ ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. బిగ్‌ బాస్‌ షో గురించి మరిచిపోయి నెటిజన్లు వీరి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

Deepthi Sunaina and shanmukh reportedly meet again on that day
Deepthi Sunaina

అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకుంటున్నారు. దీంతో ఆ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. అయితే తాజాగా వైరల్‌ అవుతున్న వార్త ప్రకారం.. త్వరలోనే ఈ లవ్‌ బర్డ్స్‌ మళ్లీ కలవబోతున్నారని తెలుస్తోంది. ఇది నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.

లవ్‌ బర్డ్స్‌ దీప్తి సునైన, షణ్ముఖ్‌లు త్వరలోనే కలవబోతున్నారంటూ వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. త్వరలో బిగ్‌ బాస్‌ ఓటీటీ ప్రారంభం కానున్న విషయం విదితమే. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో ప్రారంభం అవుతుందని నాగార్జున చెప్పేశారు. దీంతో ఈ షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే బిగ్‌ బాస్‌ ఓటీటీలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల లిస్ట్‌ కూడా ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే షో ప్రారంభం సమయంలో బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లు కొందరిని పిలిచి సందడి చేయనున్నారట. వారిలో దీప్తి సునైన, షణ్ముఖ్‌లు కూడా ఉన్నారు. ఇక ఈ షోను ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రారంభించనున్నారని.. అదే రోజు ఈ మాజీ కంటెస్టెంట్లతో షోను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక వేదికపై దీప్తి సునైన, షణ్ముఖ్‌లు కూడా వస్తారు కనుక.. నిర్వాహకులు అదే వేదికపై ఈ ఇద్దరినీ మళ్లీ కలుపుతారని తెలుస్తోంది. అందుకు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. వీరిద్దరూ కలవాలని వీరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి అది నిజం అవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment