Samantha Pushpa Song : వివాదంలో స‌మంత ఐటమ్‌ సాంగ్.. కేసు న‌మోదు అయిన‌ట్టు వార్త‌లు..!

December 13, 2021 8:17 PM

Samantha Pushpa Song : గ్లామ‌ర్ బ్యూటీ స‌మంత ఈ మ‌ధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలలో హీరోయిన్‌గా చేస్తూ వ‌స్తున్న ఈ ముద్దుగుమ్మ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ కోసం స్పెషల్‌ సాంగ్‌లో చేసింది. డిసెంబ‌ర్ 10న విడుద‌లైన.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Samantha Pushpa Song making controversy rumors are spreading

ఈ పాట‌లో స‌మంత కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. మ‌రోవైపు చంద్రబోస్‌ సాహిత్యం, ఇంద్రావ‌తి చౌహాన్ గాత్రం పాట‌కి మాంచి ఊపు తెచ్చాయి. అయితే ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ పాట‌పై అదే రేంజ్‌లో రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఈ సాంగ్ తమిళ స్టార్‌ హీరో సూర్య-తమన్నా జంటగా నటించిన వీడొక్కడే మూవీ లోని ‘హానీ.. హానీ..’ పాట‌కు కాపీ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. క‌ట్ చేస్తే ఈ సాంగ్ మ‌రో వివాదంలో ఇరుక్కుంది.

స‌మంత చేసిన ఐటమ్‌ సాంగ్ లోని లిరిక్స్ పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే ఆ పాటను తీసేయాలి.. అంటూ డిమాండ్ చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ఓ సంస్థ‌. పురుషులను కించపరుస్తూ.. లిరిక్స్ రాయడం ఏంటని… వెంటనే దీనిపై క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ తీసిన చిత్ర బృందంపై.. అలాగే ఈ సాంగ్ లో నటించినందుకు సమంతపై.. కేసు నమోదు చేసినట్లు.. సమాచారం అందుతోంది. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment