Sai Pallavi : తనకంటూ కొన్ని రూల్స్ ఏర్పరచుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకున్న సాయిపల్లవికి తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా సరే సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతోపాటు తన నటనతో ఫిదా చేస్తూ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో సైతం నటిగా ఆఫర్లను సాధిస్తూ విజయాలను నమోదు చేస్తున్న సాయిపల్లవి నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పిస్తూ రౌడీ హీరోయిన్ గా మారింది.
ఇక సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మూవీ హిట్ కాగా.. విరాటపర్వం ఫ్లాప్‌గా నిలిచింది. అలాగే శ్యామ్ సింగరాయ్ లోనూ నటించి ఆకట్టుకుంది. ఇక ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేసిన సందర్భాలున్నాయి. సాయిపల్లవి తల్లి రాధ నాట్యకారిణి. తండ్రి కన్నన్ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు. ఆమె తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో నటించి ఆ తరువాత మీరా జాస్మిన్ కు క్లాస్ మెట్ గా నటించింది.
అయితే స్టడీస్ పై దృష్టి పెట్టి జార్జియాలో మెడిసిన్ పూర్తిచేసి మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఇక అల్లు అర్జున్ డ్యాన్సులంటే సాయిపల్లవికి ఇష్టం. అయితే ఫిదాలో తన డ్యాన్స్ ను అల్లు అర్జున్ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది. ఇక సాయిపల్లవి ప్రస్తుతం సినిమాలు ఏవీ చేయడం లేదు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…