Renu Desai : రేణూ దేశాయ్ అంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగా అందరికి గుర్తొస్తుంది. బద్రి’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న రేణూ ఆయనతో కలిసి జాని సినిమా కూడా చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడం అది ప్రేమగా మారి 2009లో పవన్-రేణు పెళ్లి చేసుకున్నారు. ఇక అనుకోని కారణాల వలన 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్లకు అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక హీరోయిన్, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణు దేశాయ్.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.
అయితే తన సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తరుచుగా సమాచారాన్ని అందిస్తుంటుంది. తాజాగా ఆమె ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యపై రేణూ దేశాయ్ పోస్ట్ పెట్టింది. త్వరలోనే కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా గుండె సంబంధ సమస్య, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే తనలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ధైర్యాన్నివ్వడం కోసం, వారిలో పాజిటివిటీని నింపేందుకే అని పేర్కొంది.
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకూడదని, శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలని రేణూ పేర్కొంది. ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను మీపై, మీ జీవితంపై ఆశను వదులుకోవద్దు అంటూ రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో తెలియజేసింది. మనకోసం ఈ విశ్వం ఎన్నో అద్భుతాలను దాచివుంచిందని, ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలంటూ పేర్కొంది. ప్రస్తుతం నేను ఈ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నానని, యోగా, ఔషధాలు, పోషకాహారాన్ని తీసుకుంటున్నట్లు, త్వరలోనే తాను సాధారణ స్థితికి వచ్చి తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నట్లు వెల్లడించింది . అయితే రేణూ తన ఆరోగ్య పరిస్థితిపై సడెన్‌గా ఇలాంటి కామెంట్ చేయడంతో అందరు షాక్‌లో ఉన్నారు. త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…