Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర భాషలలోను సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న హిందీ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ చిత్రం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందగా, ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. అర్జున్ రెడ్డికి మించి వైలెంట్, వైల్డ్ గా యానిమల్ లో రన్బీర్ కపూర్ రోల్ డిజైన్ చేశారు. ఈ క్రమంలో శృంగార సన్నివేశాల డోసు కాస్త ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తెలుగులో చాలా పద్దతిగా నటించిన రష్మిక ఇందులో రెచ్చిపోయింది. కెరీర్ బికినింగ్ లోనే లిప్ లాక్ వంటి బోల్డ్ సీన్స్ చేసిన రష్మిక… గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్ దేవరకొండతో రెచ్చిపోయింది.
ఇప్పుడు యానిమల్‌లో అయితే మరో లెవల్ అని చెప్పాలి. లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ వంటి వాటిలో రష్మిక తెగ జీవించేసంది. ఇద్దరి మధ్య గాఢమైన బంధం చెప్పాలంటే లిప్ లాక్ చేయించడమే అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాగా నమ్ముతాడు కాబట్టి యానిమల్‌లో కూడా అలానే చేయించాడు. అయితే ఈ సినిమాలో ఇంత రొమాన్స్ కనబరిచినందుకు రష్మిక బాగానే వసూలు చేసినట్టు తెలుస్తుంది. సుమారు రూ.4కోట్లను రెమ్యూనరేషన్‍గా అందుకున్నారని రిపోర్టులు వచ్చాయి. విలన్‍గా నటించిన బాబీ డియోల్ రూ.5కోట్ల రెమ్యూనరేషన్ అందుకోగా, రణ్‍బీర్ తండ్రి పాత్రలో చేసిన సీనియర్ నటుడు అనిల్ కపూర్ రూ.2కోట్లు అందుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇక ప్రధాన పాత్ర పోషించిన రణ్‌బీర్ కపూర్ రూ.30 కోట్లు అందుకున్నట్టు సమాచారం.
ఏది ఏమైనా యానిమల్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న క్రమంలో రష్మిక ఖాతాలో భారీ హిట్ పడింది. ఫస్ట్ డే యానిమల్ రూ. 116 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సెకండ్ డే కూడా కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెంట్ కి చేరువ అయింది. యానిమల్ తెలుగు రాష్ట్రాల బయ్యర్లకు కూడా లాభాలు పంచడం ఖాయం. తండ్రీకొడుకుల సెంటిమెంట్‍తో యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌గా యానిమల్ చిత్రం రూపొందింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…