Rashmika Mandanna : యానిమ‌ల్ సినిమాలో రెచ్చిపోయిన ర‌ష్మిక‌.. ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంది అంటే..!

December 4, 2023 3:48 PM

Rashmika Mandanna : ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు ఇత‌ర భాష‌ల‌లోను స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న హిందీ చిత్రం యానిమ‌ల్. ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌గా, ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ దక్కుతుంది. అర్జున్ రెడ్డికి మించి వైలెంట్, వైల్డ్ గా యానిమల్ లో రన్బీర్ కపూర్ రోల్ డిజైన్ చేశారు. ఈ క్రమంలో శృంగార సన్నివేశాల డోసు కాస్త ఎక్కువ‌గానే ఉంది. ముఖ్యంగా తెలుగులో చాలా ప‌ద్ద‌తిగా న‌టించిన ర‌ష్మిక ఇందులో రెచ్చిపోయింది. కెరీర్ బికినింగ్ లోనే లిప్ లాక్ వంటి బోల్డ్ సీన్స్ చేసిన ర‌ష్మిక‌… గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్ దేవరకొండతో రెచ్చిపోయింది.

ఇప్పుడు యానిమ‌ల్‌లో అయితే మ‌రో లెవ‌ల్ అని చెప్పాలి. లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ వంటి వాటిలో ర‌ష్మిక తెగ జీవించేసంది. ఇద్దరి మధ్య గాఢమైన బంధం చెప్పాలంటే లిప్ లాక్ చేయించడమే అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాగా న‌మ్ముతాడు కాబ‌ట్టి యానిమ‌ల్‌లో కూడా అలానే చేయించాడు. అయితే ఈ సినిమాలో ఇంత రొమాన్స్ క‌న‌బ‌రిచినందుకు ర‌ష్మిక బాగానే వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తుంది. సుమారు రూ.4కోట్లను రెమ్యూనరేషన్‍గా అందుకున్నారని రిపోర్టులు వచ్చాయి. విలన్‍గా నటించిన బాబీ డియోల్ రూ.5కోట్ల రెమ్యూనరేషన్ అందుకోగా, రణ్‍బీర్ తండ్రి పాత్రలో చేసిన సీనియర్ నటుడు అనిల్ కపూర్ రూ.2కోట్లు అందుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇక ప్ర‌ధాన పాత్ర పోషించిన రణ్‌బీర్ క‌పూర్ రూ.30 కోట్లు అందుకున్న‌ట్టు స‌మాచారం.

Rashmika Mandanna remuneration in animal movie
Rashmika Mandanna

ఏది ఏమైనా యానిమల్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్న క్రమంలో రష్మిక ఖాతాలో భారీ హిట్ పడింది. ఫస్ట్ డే యానిమల్ రూ. 116 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సెకండ్ డే కూడా కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెంట్ కి చేరువ అయింది. యానిమల్ తెలుగు రాష్ట్రాల బయ్యర్లకు కూడా లాభాలు పంచడం ఖాయం. తండ్రీకొడుకుల సెంటిమెంట్‍తో యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌గా యానిమల్ చిత్రం రూపొందింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now