Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఆకట్టుంది. కన్నడం నుంచి తెలుగుకు, ఆ తర్వాత తమిళం, తాజాగా బాలీవుడ్ బాట పట్టి ఇప్పుడు అక్కడ కూడా మంచి విజయాలు సాధిస్తుంది. పుష్ప సినిమా ఘనవిజయంతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన రష్మిక ఈ ఏ డాది సంక్రాంతికి వారసుడు సినిమాతో పలకరించింది. తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న క్రమంలో ఈ అమ్మడిని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది.
రష్మిక మందన్నను ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది, అంటే 4 కోట్ల మంది ఫాలో అవుతున్నారు . ‘యానిమల్’ సినిమా విజయం సాధించడం ఈ భామకు క్రేజ్ మరింత పెరిగింది. దక్షిణాది హీరోయిన్స్‌లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఇంతవరకు ఎవరూ ఈ మార్క్ ను టచ్ చేయలేకపోయారు. సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న రష్మిక..బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాలో నటించి పాపులారిటీ పెంచుకుంది.
యానిమల్ చిత్రం ఒక మనిషి.. క్రూరుడిగా ఎందుకు మారాడనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌తో అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. యానిమల్ మూవీతో దర్శకుడిగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోగా, ఈ సినిమాతో రణ్‌బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగాలకి మంచి బూస్టప్ వచ్చినట్టు అయింది. ఇక ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప2 చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…