Rashmika Mandanna : యానిమ‌ల్ ఎఫెక్ట్.. ర‌ష్మిక ఖాతాలో చేరిన‌ 40 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్..

December 8, 2023 12:58 PM

Rashmika Mandanna : క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందాన గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ ముద్దుగుమ్మ ఆక‌ట్టుంది. కన్నడం నుంచి తెలుగుకు, ఆ తర్వాత తమిళం, తాజాగా బాలీవుడ్ బాట పట్టి ఇప్పుడు అక్క‌డ కూడా మంచి విజ‌యాలు సాధిస్తుంది. పుష్ప సినిమా ఘనవిజయంతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన ర‌ష్మిక ఈ ఏ డాది సంక్రాంతికి వారసుడు సినిమాతో పలకరించింది. తాజాగా రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యానిమ‌ల్ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న క్ర‌మంలో ఈ అమ్మ‌డిని ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతుంది.

రష్మిక మందన్నను ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది, అంటే 4 కోట్ల మంది ఫాలో అవుతున్నారు . ‘యానిమల్‌’ సినిమా విజయం సాధించడం ఈ భామకు క్రేజ్ మరింత పెరిగింది. దక్షిణాది హీరోయిన్స్‌లో ఇది ఒక రికార్డు అని చెప్పాలి. ఇంతవరకు ఎవరూ ఈ మార్క్ ను టచ్ చేయలేకపోయారు. సౌత్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకున్న ర‌ష్మిక‌..బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ సినిమాలో నటించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాలో నటించి పాపులారిటీ పెంచుకుంది.

Rashmika Mandanna got huge fan followers after animal movie success
Rashmika Mandanna

యానిమ‌ల్ చిత్రం ఒక మనిషి.. క్రూరుడిగా ఎందుకు మారాడనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌తో అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. యానిమల్ మూవీతో దర్శకుడిగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోగా, ఈ సినిమాతో రణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక‌, సందీప్ రెడ్డి వంగాల‌కి మంచి బూస్ట‌ప్ వ‌చ్చిన‌ట్టు అయింది. ఇక ఇదిలా ఉంటే ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ప‌2 చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రం కూడా విజ‌యం సాధిస్తే అమ్మ‌డి రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now