Rashmika Mandanna : బాయ్ ఫ్రెండ్ గురించి ఎట్టకేల‌కి ఓపెన్ అయిన ర‌ష్మిక‌

December 24, 2023 11:56 AM

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్ అవుతుంంది. ఇటీవలే ఒక డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది. అందులో నటించింది తాను కాదని తేలిసింది. అయితే మరోసారి ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి విడుదల చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేసింది. తాజాగా యానిమల్‌ చిత్రంతో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది రష్మిక మందన్నా. పుష్ప చిత్రంతోనే పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ భామ‌.. యానిమల్‌ చిత్రంతో దాన్ని మించిన ఇమేజ్‌ని సంపాదించింది. అల్లు అర్జున్ పుష్ప2 లో నటిస్తోంది. మరో సారి శ్రీవల్లిగా సందడి చేయబోతోంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించింది.

యానిమల్ చిత్రం కోసం కొన్నాళ్లు ముంబైలో ఉండ‌గా, ఈ మూవీ కంప్లీట్ కాగానే మళ్లీ హైదరాబాద్ షిఫ్ట్ అయి.. తన సినిమాల్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ వివరాలు బయటపెట్టింది రష్మిక. రష్మికకు బాయ్ ఫ్రెండా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇది సినిమాలోనే భాగంగానే. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా లేడీ ఒరియెంటెడ్ గా తెరకెక్కుతుండగా.. ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండుగా ఓ హీరో నటించనున్నారు. దసరా సినిమాలో నాని ఫ్రెండుగా నటించిన దీక్షిత్ శెట్టి .. రష్మిక బాయ్ ఫ్రెండుగా ది గర్ల్ ఫ్రెండు మూవీలో నటించనున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మేకర్స్ గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ తెలిపారు.

Rashmika Mandanna finally told about her boy friend
Rashmika Mandanna

ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు. వీడియోలో విక్రమ్ గురించి రష్మిక తన మాటల్లో చెప్తుండగా.. ఇంకో పక్క అగ్రెసివ్ గా ఉన్న విక్రమ్ ను చూపించారు మేకర్స్. ఇక ఈ సినిమాకు రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహించ‌గా, ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది .మొన్న‌టి వ‌ర‌కు స‌రైన స‌క్సెస్‌లు లేని ర‌ష్మిక ఇప్పుడు మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now