Rashmika Mandanna : విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లో దీవాళి నాడు ప్ర‌త్య‌క్షం అయిన ర‌ష్మిక‌.. అంద‌రిలో అనుమానాలు.!

November 13, 2023 12:35 PM

Rashmika Mandanna : టాలీవుడ్ క్యూట్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విజయ్ దేవరకొండ, రష్మిక ముందుగా ‘గీతా గోవిందం’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికి ముఖ్య కారణం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీనే అని చెప్పాలి . ఈ మూవీలో వీరి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. ఆ తర్వాత విజయ్, రష్మిక కలిసి ‘డియర్ కామ్రేడ్‌’లో నటించ‌గా, ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ చాలా క్లోజ్‌గా క‌నిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు విజయ్‌కు, రష్మికకు.. వీరి ప్రేమ వ్యవహారం గురించి విడివిడిగా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

అయినా కూడా మేము కేవలం ఫ్రెండ్స్ అని చెప్పేవారు.కాని విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక మందానకు ఆహ్వానం ఉంటుంది. విజయ్ దేవరకొండ సొద‌రుడు ఆనంద్ దేవరరకొండ బేబీ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఇవ్వన్నీ ప్రియుడు విజయ్ కోసమే చేస్తుందనే వాదన ఉంది. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మరోసారి విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమికులు అంటూ ప్రచారం మొదలైంది. దానిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Rashmika Mandanna celebrates diwali with vijay deverakonda
Rashmika Mandanna

గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక రెండు సార్లు మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ విషయం అడిగితే… స్నేహితుడితో వెకేషన్ కి వెళితే తప్పేంటని రష్మిక సమాధానం చెప్పింది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా రష్మిక జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైన ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం నెట్టింట చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి మాదిరిగా ర‌ష్మిక‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now