Rana And Suresh Babu : ఇర‌కాటంలో ప‌డ్డ రానా, సురేష్ బాబు.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు..

February 11, 2023 3:45 PM

Rana And Suresh Babu : టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా ప్ర‌స్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఫిలిం నగర్ లాండ్ వివాదంలో సురేష్ బాబు,రానా మీద క్రిమినల్ కేసు నమోదయిన విష‌యం తెలిసిందే. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, ఆ ఫిర్యాదులో ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళితే ప‌ట్టించుకోలేద‌ని అందుకే ప్ర‌మోద్ కుమార్‌ కోర్టు కెళ్లారు. కోర్టు జోక్యంతో సురేష్ బాబు, రానా స‌హా మ‌రి కొంత‌మందిపై కేసు న‌మోదు చేశారు.

సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. తాజాగా ఈ వ్య‌వ‌హారంలో కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్‌లోని కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో 1007 గజాల స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ స్థలం విషయంలో ముందు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు నడుచుకోవటం లేదని , తమ వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించటం లేదని బంజారా హిల్స్‌కి చెందిన ప్రమోద్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు.

Rana And Suresh Babu in trouble facing criminal charges
Rana And Suresh Babu

2018లో లీజు ముగుస్తుంద‌న‌గా.. ప్లాట్‌ నం.2లోని స్థలాన్ని రూ. 18 కోట్లకు అమ్మేందుకు సురేష్ బాబు ఆస‌క్తి చూపించ‌టంతో ప్ర‌మోద్ రూ.5 కోట్లు చెల్లించి, డీల్ రాసుకున్నారు. అయితే అంత‌కు ముందే లీజు గ‌డువు ముగిసినా ప్ర‌మోద్ ఖాళీ చేయ‌టం లేదంటూ ప్ర‌మోద్‌పై సురేష్ బాబు కేసు వేసి నోటీసులిచ్చారు. అయితే త‌న వ‌ద్ద రూ.5 కోట్లు అడ్వాన్స్ తీసుకుని సురేష్ బాబు రిజిస్ట్రేష‌న్ చేయ‌టం లేదంటూ ప్ర‌మోద్ కోర్టుని ఆశ్ర‌యించారు. ఈ వ్య‌వ‌హారంలో 5 కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో లీజు స్థ‌లంలో ఉంటున్న ప్ర‌మోద్ కుమార్ సెక్యూరిటీని త‌రిమి వేయ‌డంతో పాటు ప్ర‌మోద్‌ను బెదిరించారు. దీంతో ప్ర‌మోద్ పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఫ‌లితం లేక‌పోవ‌టంతో ఆయ‌న నాంప‌ల్లి కోర్టుకు వెళ్లారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now