Pushpa Movie : ఆ సాంగ్‌ నుంచే పుష్ప ఐటమ్‌ సాంగ్‌ను కాపీ కొట్టారా..?

December 11, 2021 3:20 PM

Pushpa Movie : అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’. ఇందులో ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టించ‌గ‌గా, స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

Pushpa Movie samantha song may be copied from that movie

ఇంద్రావతి చౌహాన్ ఆల‌పించిన సాంగ్‌ మాస్‌ను ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ఇందులో స‌మంత లంగాలో మెరిసిపోయి అందాలు ఆర‌బోసింది. మొద‌టిసారిగా బ‌న్నీ కోసం ఈ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాకు ఈ స్పెష‌ల్ సాంగ్ మ‌రింత స్పెష‌ల్‌ అట్రాక్షన్‌గా మారింది. కేవలం ఐదు రోజులలో మాత్రమే షూటింగ్ చేసిన‌ ఈ పాట కోసం స‌మంత‌ ఏకంగా రూ. 1 కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి.

సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్.. తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన వీడొక్కడే సినిమాలోని హనీ.. హనీ.. పాటను పోలి ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే పాటను పుష్ప కోసం కాపీ చేశారా ? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్‌ పార్టీ’ని హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment