Pushp a: డిసెంబర్ 17న విడుదల కానున్న పుష్ప చిత్రం ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రీమియర్స్ జరగనుండగా, రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న ఏడు భాషల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. థియేటర్స్ వద్ద ‘పుష్ప’ ప్రభంజనం ఎలా ఉంటుందో అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. రెండు రోజుల ముందుగానే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఇతడు పుష్ప చిత్రం ఫస్ట్ హాఫ్ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం చూశాక ‘పుష్ప’ ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని జోస్యం పలికారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. రష్మిక అద్భుతంగా నటించిందన్న ఉమైర్ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సుకుమార్ దర్శకత్వం ఓ రేంజ్‌లో ఉందని ప్రశంసలు కురిపించారు. దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమర్ సంధు తరచూ సినిమా విడుదలకు ముందే రివ్యూలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…