Pushpa: పుష్ప ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చింది.. సినిమా అదిరిపోయిందంటున్న అభిమానులు

December 17, 2021 11:14 AM

Pushp a: డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానున్న పుష్ప చిత్రం ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రీమియ‌ర్స్ జ‌ర‌గ‌నుండ‌గా, రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ భారీ అంచనాల నడుమ డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. థియేటర్స్ వద్ద ‘పుష్ప’ ప్రభంజనం ఎలా ఉంటుందో అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. రెండు రోజుల ముందుగానే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Pushpa first review out movie is amazing

ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడైన ఇతడు పుష్ప చిత్రం ఫస్ట్‌ హాఫ్‌ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం చూశాక ‘పుష్ప’ ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్‌ చిత్రంగా నిలుస్తుందని జోస్యం పలికారు. ఈ సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌ను మలుపు తిప్పుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.

బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. రష్మిక అద్భుతంగా నటించిందన్న ఉమైర్‌ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సుకుమార్‌ దర్శకత్వం ఓ రేంజ్‌లో ఉందని ప్రశంసలు కురిపించారు. దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే ఉమర్ సంధు తరచూ సినిమా విడుదలకు ముందే రివ్యూలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్‌ అవుతుంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now