Samantha : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రిలీజ్ కి ముస్తాబైన మూవీ పుష్ప. ఈ నెల 17న 5 భాషల్లో విడుదల కాబోతుంది. అల్లు అర్జున్, రష్మిక నటిస్తున్న ఈ సినిమా లో సునీల్, అనసూయ, ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన పాటలు ఇప్పటికే కుర్రకారులో హుషారు తెప్పిస్తున్నాయి.
సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపొజిషన్ లో ఆ పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి కూడా. ఆ అంటే అమలాపురం, రింగ రింగా, డియ్యాలో డియ్యాలో, లండన్ బాబు, జిగేల్ రాణి లాంటి పాటలు ఆ కోవ లోకే వస్తాయి. పుష్ప సినిమాకి కూడా ఒక ఐటమ్ సాంగ్ ని రెడీ చేశారు సుకుమార్. “ఊ అంటావా మావ , ఊహు అంటావా మావ ” అని సాగే పాటలో స్టార్ హీరోయిన్ సమంత ఆడి పాడింది. ఆ పాట విడుదల అయినప్పటినుండి ఫుల్ ట్రెండింగ్ లో ఉంటూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నది.
యూట్యూబ్ లో విడుదలై 34 మిలియన్స్ కి పైగా వ్యూస్ సంపాదించింది. ఈ పాటకి సమంత లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన మరో విషయం హల్‌చల్ చేస్తుంది. అదే ఈ పాటకి అయిన ఖర్చు గురించి. సెట్ వేసి, ఒక వారంలోనే అంతా పూర్తి చేసిన ఈ పాటకి 5 కోట్ల వరకు ఖర్చు అయ్యిందంట ప్రొడ్యూసర్స్ కి.
సమంత ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో ఆడి పాడినందుకు కోటి రూపాయలు తీసుకుందని సమాచారం. మొత్తానికి ఈ పాట కోసం ఒక చిన్న సినిమా బడ్జెట్ అంత ఖర్చుపెట్టారు. ఇక స్క్రీన్ మీద ఈ ఖరీదైన పాట ఎలా ఉంటుందో చూడాలంటే 17 వరకు ఆగాల్సిందే.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…