Vamika : విరాట్ – అనుష్కల ముద్దుల కూతురు వామిక ఈ ఏడాది జనవరి 11న జన్మించిన విషయం తెలిసిందే. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూతురి ఫేస్ ఎక్కడా రివీల్ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు టీమిండియా సౌతాఫ్రికా టూర్‌కి వెళుతున్న నేపథ్యంలో అనుష్క బస్ నుండి కిందకు దిగే క్రమంలో ఫొటోగ్రాఫర్స్ అనుష్క చేతిలో ఉన్న వామికను తమ కెమెరాలో బంధించారు.
ప్రస్తుతం వామికని చూసి అందరూ విరాట్ కోహ్లీ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెండు పిలకలు వేసుకొని బొద్దుగా, ముద్దుగా ఉన్న చిన్నారిని చూసి అనుష్క, కోహ్లీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం వామిక పిక్స్ వైరల్‌గా మారాయి. డిసెంబరు 26 నుంచి సఫారీ గడ్డపై మూడు టెస్టులు, జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ని ఆడనున్న భారత్ గత మూడు రోజులుగా ముంబయిలో క్వారంటైన్‌లో ఉంది.
ఈ క్వారంటైన్ సమయంలో భారత క్రికెటర్లతోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. దాంతో.. ఈరోజు ఉదయం ఛార్టర్డ్ ప్లైట్‌లో టీమ్ బయల్దేరి వెళ్లింది. ఇదిలా ఉంటే వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి (దుర్గాదేవి) మరోపేరు అది. స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబింబించే పేరు వామిక. అర్ధనారీశ్వర రూపంలో శివుడు కుడి వైపు ఉంటే.. ఎడమ వైపు పార్వతి దేవి ఉంటారు. ఎడమ అంటే వామ అని అర్థం. అందుకే పార్వతిని వామిక అంటారు. విరాట్ – అనుష్క పేర్లు కలిసేలా కూడా ఈ పేరు ఉండడం విశేషం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…