Anee Master: బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రియాల్టీగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షో వల్ల చాలా మంది కంటెస్టెంట్స్ పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంట షో చూపించడం వలన వారిపై నెగెటివిటీ రావడంతో తప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కేవలం కంటెస్టెంట్ లు మాత్రమే కాకుండా కొన్నిసార్లు వారి కుటుంబసభ్యుల గురించి కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ ట్రోలింగ్‌ను మాత్రం కొందరు సీరియస్ గా తీసుకుంటే.. మరికొందరు అస్సలు పట్టించుకోవడం లేదు.
అనూహ్యంగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన రవితోపాటు ఆయన భార్య, కూతురు మీద ట్రోల్ చేసే సరికి వారి పట్ల సీరియస్ అయ్యాడు రవి. తనపై.. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసిన వారిని అస్సలు వదలిపెట్టను అంటూ హెచ్చరించాడు రవి. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సేకరించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకుని మరీ ఆధారాలు.. స్క్రీన్ షాట్స్ దగ్గరుండి చూపించినట్టుగా కనిపిస్తోంది. మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా అని అన్నాడు.
ఇక తాజాగా రవి తీసుకున్న నిర్ణయాన్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ అభినందించింది. అంతేకాదు నోటికొచ్చినట్లు మాట్లాడినా, చెడ్డ కామెంట్లు పెట్టినా తాను కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. నేను ఎంత జెన్యూన్‌గా ఉన్నానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసింది చాలు అంటూ ఫైర్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో 24 గంటలు ఏం జరుగుతుందనేది మీకు తెలియదని, కాబట్టి విమర్శించడం మానేస్తే మంచిదని వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…