Priyanka Chopra : ఏంటి.. ప్రియాంక చోప్రా ఇండియాలో త‌న ఆస్తుల‌న్నింటిని అమ్ముకుంటుందా?

November 18, 2023 9:19 PM

Priyanka Chopra : బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో తెగ సంద‌డి చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తుంది.ఈ అమ్మ‌డు తన నటన, ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా హిందీలో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2018లో నిక్ జోనాస్‌తో వివాహం ‍‌చేసుకున్న తర్వాత, ప్రియాంక లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చింది. ప్రస్తుతం ఈ జంట, వారి కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో ‍ కలిసి నివసిస్తోంది. అయితే ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది.

ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే సెటిలైన ఈ ముద్దుగుమ్మ అక్క‌డ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్‌లు కూడా చేస్తుంది. అప్పుడ‌ప్పుడు ప్ర‌త్యేక పండుగ సంద‌ర్భంలో మాత్రం ప్రియాంక ఇండియాకి వ‌స్తుంది. అయితే ప్రియాంక ఒక‌ప్పుడు ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసింది . అయితే ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేసిందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో ఓ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. గ‌త ఏడాది త‌న పేరిట ఉన్న కొన్ని ఆస్తుల‌ని విక్ర‌యించిన ఈ గ్లోబ‌ల్ భామ ప్ర‌స్తుతం మ‌రో రెండు పెంట్ హౌజ్‌లు కూడా అమ్మేసినట్టు స‌మాచారం. దీపావళి వేడుకల కోసం ప్రియాంక ముంబైకి రాగా, ఆ స‌మ‌యంలో ముంబైలోని అంధేరిలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Priyanka Chopra reportedly selling all her properties in india
Priyanka Chopra

ముంబైలోని పోష్‌ ఏరియా అయిన అంధేరీ శివారులో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌస్‌లను.. దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబేకి రూ. 6 కోట్లకు విక్రయించింది. రెండు ఫ్లాట్ల మొత్తం విస్తీర్ణం 2,292 చదరపు అడుగులు కాగా,ఈ సేల్ డీల్ అక్టోబర్ నెలలో జరిగింది. లోఖండ్‌వాలాలోని కరణ్ అపార్ట్‌మెంట్ టవర్‌లో, 9వ అంతస్తులో ఉన్న ఈ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ అమ్మకాలను ప్రియాంక తల్లి మధు చోప్రా చూసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23, 25 తేదీల్లో వాలాదేవీలు జరిగాయి. ఫ్లాట్లను కొన్న చౌబే, మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలుగా రూ. 36 లక్షలు చెల్లించారు. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింది ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగిన‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now