Prabhas On Salaar Success : బాహుబలి 1,2 చిత్రాలతో ఎంతో పెద్ద విజయాలని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో డిజాస్టర్స్ చవిచూశాడు. వరుస ఫ్లాపుల తర్వాత సలార్ రూపంలో ప్రభాస్‌కి అతి పెద్ద సక్సెస్ వచ్చింది. మొత్తానికి రెబల్ స్టార్ ప్రభాస్ 2023ని ఘనంగా ముగించాడు అనే చెప్పాలి. బాహుబలి తర్వాత ఊరిస్తూ వస్తున్న విజయం సలార్ తో దక్కడంతో అభిమానులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఆ అంచానాలు అన్నీ కూడా సలార్ తో నిలబడ్డాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కావాలని అనుకుంటున్నారో అలాంటి వినోదం పంచింది. డార్లింగ్ కటౌట్ కు కరెక్ట్ సినిమా ఇది అంటున్నారు ఫ్యాన్స్. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సలార్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. కల్కి 2898ఎడి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు అశ్విన్. మరోవైపు మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ చిత్రం చేస్తుండగా, ఈ రెండు చిత్రాలు కూడా 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే సలార్ సక్సెస్ తర్వాత మూవీ టీం అందరు కూడా తమ అభిప్రాయాలని పంచుకున్నారు. ప్రభాస్ మాత్రం స్పందించింది లేదు. ఎట్టకేలకు న్యూ ఇయర్ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సలార్ మూవీలోని పోస్టర్ షేర్ చేస్తూ.. నేను ఖాన్సార్ భవిష్యత్తేంటో తేల్చే లోపు మీరు హాయిగా న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి డార్లింగ్స్.. సలార్ సీజ్‌ఫైర్‌ను మీ సినిమాగా భావించి పెద్ద సక్సెస్ అందించినందుకు థ్యాంక్యూ అని కామెంట్ పెట్టాడు. ప్రభాస్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇక సలార్ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించగా, ఈ మూవీ షారూఖ్ డంకీ మూవీని కూడా తట్టుకొని 10 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…