Sriram Chandra: శ్రీరామ చంద్రకి పెరుగుతున్న మ‌ద్ద‌తు.. ప్రభాస్ ఫామిలీ సపోర్ట్ కూడా ల‌భించిందే..!

December 17, 2021 11:25 AM

Sriram Chandra : స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఈ వారంతో ముగియనున్నది. టాప్ 5 లో శ్రీ రామ చంద్ర, షణ్ముఖ్, సన్నీ, సిరి, మానస్ ఉన్నారు. వీరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 5 కి విజేత గా నిలుస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

Sriram Chandra got support from prabhas family

బయట నుండి అభిమానులు వేసే ఓట్లతో విన్నర్ ని నిర్ణయిస్తారు బిగ్ బాస్. ఆఖరి వారం కావడంతో బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ లు దాదాపుగా పూర్తయినట్టే. తమకి నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్ వేయమని సెలబ్రిటీలు సైతం వీడియోల రూపంలో ప్రేక్షకులని కోరుతున్నారు. టాప్ 5 లో ఉన్న శ్రీరామ చంద్రకి వోట్ వేయమని ఇప్పటికే సోను సూద్, శంకర్ మహదేవన్, సజ్జనార్, హీరోయిన్ పాయల్ రాజపూత్ కోరారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన యాంకర్ రవి, అనీ మాస్టర్ కూడా శ్రీ రామ్ కే ఓట్ వేయమని ప్రచారం చేస్తున్నారు.

శ్రీరామ్ కి సపోర్ట్ ఇస్తున్న వారిలో డార్లింగ్ ప్రభాస్ ఫామిలీ కూడా ఉన్నారు . ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి శ్రీ రామ్ కి ఓట్ వేయమంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ” ఇండియన్ ఐడల్ నుండి నిన్ను చూస్తున్నాం, నువ్వు పాడే భక్తి పాటలంటే మాకు చాలా ఇష్టం. అపుడు ఇండియన్ ఐడల్ గెలిచి తెలుగు వాళ్ళు గర్వపడేలా చేశావ్, ఇప్పుడు బిగ్ బాస్ కూడా గెలిచి రావాలి ” అంటూ చెప్పారు. మరీ సెలబ్రిటీల సపోర్ట్ కూడా ఉన్న శ్రీరామ్ చంద్ర ఈ సీజన్ కి విన్నర్ అవుతాడో లేదో చూడాలంటే సండే వరకు ఆగాల్సిందే.

https://www.instagram.com/p/CXiBFTrNja9/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment