Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న ప్రభాస్ రీసెంట్‌గా సలార్ చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా బడా హిట్ కొట్టింది. అయితే ప్రభాస్ డైలాగ్‌ని హైదరాబాద్ పోలీసులు వాడుకొని మందుబాబులకి వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 21న విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ అదిరిపోయే టాక్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. సినిమాలోని ఫైట్స్, ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో సలార్‌లోని పాపులర్ డైలాగ్‌ని ఉపయోగించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వచ్చే నష్టాలను తెలిపేలే ఓ వీడియో క్రియేట్ చేశారు.
తాజా వీడియాలో ప్రభాస్ డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ లిక్కర్, యాక్సిడెంట్ ఫొటోలను చూపించారు. “ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పాగా” అని ప్రభాస్ డైలాగ్‌కు లిక్కర్ ఫొటోలు పెట్టి దాన్ని ముట్టుకోవద్దు అని అర్థం వచ్చేలా క్రియేట్ చేశారు. “ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని పేర్కొంటూ కారు ప్రమాదాలు జరిగిన విజువల్స్ చూపించడం ఆసక్తిని రేకెత్తించింది.. ఇలా సలార్‌లో ప్రభాస్ డైలాగ్స్‌ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల క్షేమం కోసం పోలీసులు ఉపయోగించడం ఆసక్తిని రేకెత్తించింది.
సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 8 రోజుల్లో తెలుగులో రూ. 130.25 కోట్లు, తమిళంలో రూ. 9.90 కోట్లు, కర్నాటకలో రూ. 19.80 కోట్లు, కేరళలో రూ. 6.00 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 53.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 54.65 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 274.55 కోట్లు షేర్, రూ. 535 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీకి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 535 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. తద్వారా మూడు సార్లు రూ. 500 కొట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఇక, ఈ చిత్రం హిందీలో రూ. 100 కోట్లు నెట్‌ను చేరినట్లు యూనిట్ తెలిపింది. దీంతో ప్రభాస్ 5 సార్లు ఈ ఫీట్ సాధించినట్లైంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…