Pallavi Prashanth : 50 మంది లాయ‌ర్ల‌తో వారిపై ప‌రువు న‌ష్టం దావా వేయ‌బోతున్న ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. ఆయ‌నే టార్గెట్..!

December 26, 2023 10:55 AM

Pallavi Prashanth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని షో బిగ్ బాస్. తెలుగులో ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. వివాదాలు కూడా ఆ షో మీద ఉన్నా కూడా ఈ షో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. రీసెంట్‌గా బిగ్ బాస్ సీజ‌న్7 పూర్తి కాగా, డిసెంబర్ 17న సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్ దీప్ ఫ్యాన్స్ తో వాళ్లకు గొడవలు అయ్యాయి. ఈ క్ర‌మంలో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ తో పాటు ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు జైలు లో గడిపిన పల్లవి ప్రశాంత్ ని బైలు మీద బయటకి తీసుకొని రావడం కోసం ఆయన స్నేహితులు చాలా కష్టపడ్డారు.

ముఖ్యంగా సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన భోలే పల్లవి ప్రశాంత్ మీద ఎంత ప్రేమ చూపించే వాడో మన అందరికీ తెలిసిందే. ఆయ‌న‌ని తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ బ‌య‌ట‌కు రావ‌డం, భోలే త‌న ఇంట్లో అంద‌రికి పార్టీ ఇవ్వ‌డం అందుకు సంబంధించిన విజువ‌ల్స్ బ‌య‌ట‌కు రావ‌డం మ‌నం చూశాం. అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఆయ‌న‌పై పలు ఛానల్స్ నెగిటివ్ పబ్లిసిటీ చేశాయి. ముఖ్యంగా యాంకర్, బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్ శివ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టాడు. వరస్ట్ బిహేవియర్. ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్లేదు. చెప్పిన విధానం దారుణంగా ఉంది. దీనిపై ఒక వీడియో చేస్తాను, అని పోస్ట్ పెట్టాడు.

Pallavi Prashanth reportedly going to file a suit
Pallavi Prashanth

అయితే తాను బాగా అల‌సిపోవ‌డం, అన్నం కూడా తిన‌క‌పోవ‌డంతో నీర‌సంగా ఉన్నాన‌ని త‌ర్వాత ఇంట‌ర్వ్యూ ఇస్తాన‌ని చెప్ప‌గా, త‌న‌పై త‌ప్పుడు ప్రచారం చేశార‌ని ప్ర‌శాంత్ అన్నాడు. అయితే జైలు నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేయాలి అనుకుంటున్నాడట. ఏకంగా 50 మంది లాయర్లు రంగంలోకి దిగారట. యూట్యూబ్ యాంకర్ శివతో పాటు పలు ఛానల్స్ పై ఆయన కేసులు పెట్టనున్నాడని సోషల్ మీడియా టాక్. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ షోతో వచ్చిన డబ్బులు పేద రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ చెప్ప‌గా,అందుకు త‌గ్గ‌ట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడ‌ట‌. కారుని తన తండ్రికి ఇవ్వ‌గా, గోల్డ్‌ని త‌న త‌ల్లికి ఇస్తాడ‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now