ర‌ష్మీపై హైప‌ర్ ఆది డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్..

February 7, 2023 5:42 PM

ఒక‌ప్పుడు సినిమాల‌లో మాత్ర‌మే బీ గ్రేడ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపించేవి. కాని ఇప్పుడు బుల్లితెర‌పై కూడా ఇవి కామన్ అయ్యాయి. హైప‌ర్ ఆది లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్స్ ఎక్కువ‌గా చేస్తూ కామెడీ పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అప్పట్లో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బీ గ్రేడ్ డైలాగ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రోజురోజుకు బూతులు ఎక్కువ అవుతున్నాయని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వాలంటైన్స్ డే సంద‌ర్భంగా సుధీర్‌ని ఉద్దేశించి ర‌ష్మీపై హైప‌ర్ ఆది చేసిన కామెంట్స్ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని గురి చేస్తున్నాయి.

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో రష్మీ ,సుధీర్ లపై పంచ్ లు వేశారు హైప‌ర్ ఆది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ‘చెప్పు బుజ్జికన్నా’ అని టైటిల్ తో ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. అయితే స్టేజ్ పైకి వచ్చిన రష్మీ ఫిబ్రవరి 14 కదా అందరికీ ఒక్కొక్కరికి గట్టిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో అప్పుడే హైపర్ ఆది అదేదో నాకు ఇచ్చేయండి నేను వెళ్లి అతడికి ఇస్తాను అంటూ సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇక అంతే కాకుండా ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్టు ఇచ్చావా లేదా అని అన్నాడు.

netizen angry on hyper aadi for his comments on rashmi gautam

అంత‌టితో ఆగ‌కుండా బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఏదో ఓ రోజు మాత్రం సడన్ గా బాబుని ఇవ్వడాలు మాత్రం చేయకండి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దీంతో అందరు నవ్వేశారు. రష్మి కూడా కాస్త సైలెంట్ అయిపోయింది. ఇలాంటి బి గ్రేడ్ సెటైర్స్ ఎందుకు వేస్తున్నారు అంటూ సుధీర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆది పై కౌంటర్ వేస్తున్నారు కామెడీ పేరుతో ఇలాంటి చెత్త జోకులు, పంచ్‌లు వేయ‌డం త‌గ‌దు అంటూ హైప‌ర్ ఆదికి చుర‌క‌లు అంటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now