Netflix CEO : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఆయన వార్ 2లో హృతిక్ రోషన్ తో కూడా కలిసి పని చేయనున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్‌గా మారింది. నెట్ఫ్లిక్స్ సీఈఓ, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో సందడి చేశారు. ఆయన ముందుగా చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, రామ్ చరణ్ లతో టెడ్ సరండోస్ ముచ్చటించారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
తర్వాత ఎన్టీఆర్ ఇంటికి టెడ్ వెళ్లారు. టెడ్ సరండోస్ తో పాటు ఆయన టీమ్ కి ఎన్టీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. వారి మధ్య సినిమా గురించి ఆసక్తికర చర్చ నడిచినట్లు తెలుస్తుంది. టెడ్ సరండోస్ తో భేటీకి సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. టెడ్ సరండోస్ టీమ్ కి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు. ఎన్టీఆర్ లాగానే సరాండోస్ కూడా భోజనప్రియుడే! దాంతో ఇద్దరి మధ్య సినిమాలు, తదితర అంశాలతో పాటు ఆహార విషయం కూడా ప్రముఖంగా చర్చకు వచ్చింది. కాగా, ఈ సమావేశంలో ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు.
ఇండియాలో నెట్ ఫ్లిక్స్‌కి చెప్పుకోదగ్గ ఆదరణ లేదు. సబ్‌స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి, రెవిన్యూ జనరేషన్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. హాట్ స్టార్, ప్రైమ్ తో పోల్చుకుంటే నెట్ఫ్లిక్స్ ఎక్కడో ఉంది. కొన్నాళ్లుగా వారు స్టార్ హీరోల చిత్రాలపై దృష్ఠి పెట్టారు. ఇందు కోసమే ఆయన మెగా, నందమూరి హీరోలని కలిసాడని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో వారిని కలిసి తమ సంస్థ స్థాయి మరింత పెంచుకునే ప్లాన్ చేసి ఉంటాడని అందరు అంటున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…