Nani : న్యాచురల్ స్టార్ నాని పెద్దగా వివాదాల జోలికి పోడు.ఒకవేళ ఆయనని ఏదైన వివాదం చుట్టుముట్టింది అంటే వెంటనే దానిపై క్లారిటీ ఇచ్చేస్తాడు. నాని హీరోగా హాయ్ నాన్న అనే సినిమా రూపొందగా, ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషన్ నేపథ్యంలో ఈ సినిమాకు అడియన్స్ ముందుకు తీసుకువస్తుండగా.. ఇందులో మరోసారి తండ్రిగా కనిపించి అలరించనున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్‌గా హైదరాబాద్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.. అయితే ఈ వేడుకలో అనుహ్యంగా విజయ్, రష్మిక మార్ఫింగ్ ఫోటో స్క్రీన్ పై కనిపించింది. మాల్దీవ్స్ లో విజయ్ ఫోటోను.. అలాగే రష్మిక ఫోటోను ఒకేచోట ఉన్నట్లుగా ఎడిట్ చేసిన ఫోటో స్క్రీన్ పై రావడంతో నాని, మృణాల్ తోపాటు.. అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వీరిద్దరూ మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు వేరువేరుగా తీసుకున్న ఫోటోలను అప్పట్లో కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ కలిపి ఒక ఫోటోగా చేయగా, ఆ ఫోటో నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రత్యక్షం కావడంతో విజయ్, రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా చెయ్యడం చాలా చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని ఏవేవో రాసేశారు. కాగా ఈ విషయంపై ఫైనల్ గా నాని స్పందించారు.హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ – రష్మికల ఫోటో అలా స్క్రీన్ పై వేయడం నిజంగా దురదృష్టకరం. ఆ ఫోటో చూసి మేము కూడా షాక్ అయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం చాలా మంది వర్క్ చేస్తారు. అది ఎవరు చేసారో కూడా తెలీదు, వాళ్ళు ఎందుకు చేసారో కూడా తెలీదు. నేను, విజయ్, రష్మిక.. మేమంతా మంచి స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్ లో అనుకోకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకి కూడా తెలుసు. ఒకవేళ ఆ చర్య వాళ్ళ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ‘హాయ్ నాన్న’ టీం నుంచి క్షమాపణలు కోరుతున్నాను అని నాని అన్నారు. కాగా, నాని – రష్మిక కూడా గతంలో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. మరి నాని క్లారిటీతో ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…