Namita Husband : బొద్దుగుమ్మ నమిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చాలా సినిమాలలో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులని కొల్లగొట్టింది. ముందు హీరోయిన్‌గా నటించిన నమిత ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌లో నటించి అదరగొట్టింది. ఆమె కొద్ది సంవత్సరాల క్రితం వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తమిళనాడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కౌన్సిల్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామంటూ గోపాల్‌స్వామి అనే వ్యక్తిని రూ.50 లక్షల మేర మోసం చేసిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా వీరేంద్ర చౌదరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపించిందని సమాచారం.
ముత్తురామన్ అనే వ్యక్తి ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ పదవిని వీరేంద్ర చౌదరి ఇటీవలే చేపట్టడంతో గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ప్రముఖ నటి, బొద్దుగుమ్మ నమిత తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన సొంతం, విక్టరీ వెంకటేశ్ సరసన జెమిని, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన బిల్లా తదితర సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం చిత్రాల్లో నటించిన నమిత ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటుంది. నమిత బీజేపీ పార్టీలో ఉన్నారు.ఇటీవల నమిత కవలలకు జన్మనివ్వగా, ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం వివాదంలో నమిత భర్త ఉండగా, ఆయన ఎలా బయటపడతాడో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…