Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైతన్య రోజు రోజుకి తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది. ఇందులో నాగ చైతన్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే తన లైఫ్‌లో జరగడం.. అది ఓ మర్డర్‌తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. సినిమా సక్సెస్‌లు లేక బాధపడుతున్న చైతన్యకి ఈ వెబ్ సిరీస్ మంచి బూస్టప్ ఇచ్చింది.
అయితే దూతకి సంబంధించి ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగ చైతన్య తను నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన లాల్ సింగ్ చడ్డా మూవీలో నటించినందుకు తనకు ఎలాంటి పశ్చాతాపం, చింత లేదని అన్నారు. అమీర్ తో కలిసి పని చేయడం వలన తను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు స్పష్టం చేశారు. నాకు సినిమా ఫ్లాఫ్ అవుతుందని ముందుగానే తెలిసినా కూడా అందులో నటించేవాడనని చెప్పారు. ఆ చిత్రం ఆఫర్ ఇప్పుడు వచ్చిన కూడా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చై స్పష్టం చేశాడు. అమీర్‌తో కలిసి పని చేయడం సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేశాడు.
ప్రతి ఒక్కరికి జయాపజాయాలు వస్తుంటాయని, వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అక్కినేని హీరో అన్నాడు. కస్టడీ ఫ్లాప్ తర్వాత నాగచైతన్య తదుపరి తండేల్ మూవీ చేస్తున్నారు.. చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తుండగా, కొద్ది రోజుల క్రితం అనౌన్స్‌మెంట్ చేశారు. పాకిస్థాన్ చేతికి చిక్కి.. మళ్లీ భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలరి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. జాలరిగా ఈ చిత్రంలో నాగ చైతన్య కనిపించి అలరించబోతున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…