Naga Chaitanya : యువ సామ్రాట్ నాగచైతన్య హిట్, ఫ్లాప్స్‌తో తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కస్టడీతో ఫ్లాప్ కొట్టిన చైతూ రీసెంట్‌గా దూత వెబ్ సిరీస్‌తో పలకరించాడు. ఈ వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు చైతూ నటనపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య హీరోగా నటించనున్న ‘తండేల్’ మూవీపై చాలా ఆసక్తి ఉంది. ఈ చిత్రంలో మత్య్సకారుడిగా ఆయన నటించనున్నారు. ఫస్ట లుక్‍తోనే ఈ చిత్రానికి ఫుల్ హైప్ వచ్చింది. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ పాత్ర పోషించనున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూ – సాయి పల్లవి రెండోసారి కలిసి నటిస్తున్నారు.
మొత్తంగా తండేల్ మూవీపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. కాగా, ఈ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని గ్లాస్ హౌస్ లో ఉదయం 10.30 గంటలకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు.. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. నాగార్జున, వెంకటేష్ తో కలిసి నాగ చైతన్యని ఒకే ఫ్రేములో చూడడం అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. ఇకిదిలా ఉంటే ‘తండేల్’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
‘తండేల్’ అంటే ఓ తెగకు నాయకుడు అని అర్థం. మత్స్యకారుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం టైటిల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.ఇటీవల దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని అర్థం అని తెలిపాడు. గుజరాత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని వాడుతారట. నాగ చైతన్యకు ఇది 23వ మూవీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‍కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. వారు పాకిస్థాన్‍లోని జైలులో ఉండగా.. విడిపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేసింది. పాక్‍తో చర్చలు జరిపింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పాకిస్థాన్ ఆ జాలర్లను విడుదల చేసింది.ఆ కథతో తండేల్ రూపొందుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…