Muthu Re-release : ర‌జనీకాంత్‌కి ఇంత అవ‌మాన‌మా.. ముత్తు సినిమా టిక్కెట్ ఒక్క‌టి కూడా అమ్ముడు పోలేదా..!

December 4, 2023 1:23 PM

Muthu Re-release : ఇప్పుడు ఇప్పుడంతా 4కె రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయినా సినిమాలు, భారీ ప్రేక్షకాధరణ పొందిన సినిమాలను హీరోల పుట్టిన రోజులకు, అదేవిధంగా ఆయా సినిమాల యానివర్సరీలకు రీరిలీజ్ చేయ‌డం ఆన‌వాయితీగా మారింది. ఇప్ప‌టికే చాలా హీరోల సినిమాలు రీరిలీజ్ జ‌రుపుకొని పెద్ద ఎత్తున ప్రేక్ష‌కుల‌ని అల‌రించాయి. ఇక ఈ నేప‌థ్యంలోడిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ముత్తు చిత్రాన్ని డిసెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేసారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లో బ్రహ్మాండంగా ముత్తు విడుదలైంది.

భారీ అంచ‌నాల‌తో ముత్తు చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ముందు ప్ర‌క‌టించ‌గా, ఈ సినిమా రీరిలీజ్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి అసలు ఎలాంటి స్పందనా లేదు. టికెట్లు కూడా అంత‌గా అమ్ముడు కాక‌పోవడంతో కొన్ని షోల‌ని కూడా ర‌ద్దు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అప్ప‌ట్లో సంచ‌ల‌నాలు సృష్టించిన ముత్తు చిత్రం రీరిలీజ్‌లోను అద‌ర‌గొడ‌తార‌ని అంద‌రు అనుకున్నారు. కాని సీన్ రివ‌ర్స్ అయింది .అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోకపోవడంతో షోలను రద్దు చేయాలని థియేటర్లు యజమానులు నిర్ణయించారు. త‌మిళ‌నాడులోనే కాకుండా తెలుగులోను ముత్తు చిత్రంకి ఇలాంటి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు.

Muthu Re-release no tickets were sold till now
Muthu Re-release

ర‌జ‌నీకాంత్ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ముత్తు ఒక‌టి. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ముత్తులో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు నేటికి శ్రోతలను, తలైవా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 23, 1995న విడుదలైన ఈ చిత్రం ఆనాడు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీస్‌ను కలెక్షన్లతో షేక్ చేసింది. తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యంలో ముచ్చెత్తింది. మన దగ్గర సంచలనం సృష్టించిన ముత్తు 1998 లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా దాదాపు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్ లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now