Mangalavaaram Box Office Collections : దుమ్ములేపుతున్న మంగళ‌వారం.. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ఎంతంటే..!

November 23, 2023 5:43 PM

Mangalavaaram Box Office Collections : నేటితరం దర్శకులు వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అలాంటి కోవలోకి వచ్చే వారిలో దర్శకుడు అజయ్ భూపతి ఒక‌రు. తాజాగా అజయ్ భూపతి నిర్మించిన మంగళవారం చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను, విమర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా RX100 మూవీతో దర్శకుడిగా మారారు. తెలుగు నేటివిటితో ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను తీర్చి దిద్దారు. ఆ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.సినిమాకి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ప్రేక్షకాదరణ భాగానే ఉంది. మౌత్ టాక్ తో ఎక్కువగా జనాలకి రీచ్ అయ్యింది.

విరూపాక్ష తర్వాత ఆ తరహాలో కంప్లీట్ థ్రిల్లర్ గా ఈ వచ్చిన మంగ‌ళ‌వారం సినిమాని ఆడియన్స్ భాగా ఆశ్వాదిస్తున్నారు. చివరి 30 నిమిషాల ఎపిసోడ్ అయితే సీట్ ఎడ్జ్ న కూర్చొని చూసేలా ప్ర‌తి ఒక్క‌రికి మైండ్ బ్లాక్ చేసింది. పాయల్ రాజ్ పుత్ కి ఈ మూవీలో మరో డేరింగ్ రోల్ చేసి మెప్పించింది. తన పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా 11.40 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. షేర్ పరంగా చూసుకుంటే 6.41 కోట్లు కలెక్ట్ అయ్యింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 6.59 కోట్లు కలెక్ట్ చేయాలి. సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చేసిన ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో బ్రేక్ ఈవెన్ వెంటనే అందుకోలేదు. ప్రస్తుతం సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తోంది. డీసెంట్ కలెక్షన్స్ ప్రతి రోజు వస్తున్నాయి.

Mangalavaaram Box Office Collections know how much it collected
Mangalavaaram Box Office Collections

మంగ‌ళ‌వారం సినిమా ఇప్పటి వరకూ రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. సినిమాకి అనూహ్య స్పంద‌న రావ‌డంతో ఇటీవ‌ల చిత్ర బృందం స‌క్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. . ఈ సందర్భంగా మూవీలో ప్రత్యేక పాత్ర పోషించిన ప్రియదర్శిని క్యారెక్టర్ ను కూడా పరిచయం చేశారు. ఓ ఊరు.. ఆ ఊళ్లో ప్రతి మంగళవారం జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది.చిత్రీకరణతోపాటు కథానాయకుడి పాత్ర లేకుండా కథనే హీరోగా మలిచి మంగళవారం సినిమాను రూపొందించారు. మానసిక సంఘర్షణ, భావోద్వేగాలతో సాగే పాయల్ రాజ్‌పుత్ పాత్ర ప్రేక్షకుడి హృదయాన్ని ఊగిసలాటకు గురిచేసేలా సినిమాను రూపొందించడంతో మూవీ దూసుకుపోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now