Manchu Manoj OTT Show : మంచు మోహన్ బాబు ముద్దుల తనయుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పాలి. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. దీంతో చాలా కాలం పాటు కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. ఇటీవలే రెండు సినిమాలను ప్రకటించాడు. మంచు మనోజ్ ఫ్యాన్స్ ఇప్పుడు వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.మనోజ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ 2017లో రాగా, 2018లో రెండు సినిమాల్లో అతిథి పాత్రలో ఆయన మెరిశారు. మంచు మనోజ్ పనైపోయింది.. ఆయన సినిమాలు చేయడు అని జనం ఫిక్సయిపోయిన తరుణంలో సొంతంగా నిర్మాణ సంస్థను పెట్టి ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాను ప్రకటించారు. కానీ, ఆ సినిమా ఏమైందో తెలీదు. దాని గురించి కనీసం అప్‌డేట్ లేదు.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ ఎలాగు సరిగా లేదు, కనీసం పర్సనల్ లైఫ్ అయిన బాగుంటుందేమో అనుకుంటే అది కూడా బెడిసి కొట్టింది. మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మనోజ్ కెరియర్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. త్వరలో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే టైటిల్‌తో ఓటీటీ షోలో సందడి చేయనున్నట్టు తెలియజేశాడు.
టాక్, గేమ్ రెండు షోలను మిక్స్ చేస్తూ టాక్ గేమ్ షోగా ర్యాంప్ ఆడిద్దాం ఉండబోతున్నట్లు మంచు మనోజ్ తెలిపాడు. ఈ షోకు వచ్చే సెలబ్రిటీలని ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ అలానే వారితో సరదా గేమ్స్ కూడా ఆడించనున్నట్టు తెలియజేశాడు. ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ షోను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇక మనోజ్ త్వరలోనే వాట్ ది ఫిష్ అనే సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…