---Advertisement---

Manchu Manoj OTT Show : మంచు మ‌నోజ్ ఓటీటీ షో టైటిల్ రివీల్.. ఇక ర్యాంప్ ఆడించుడే..!

November 20, 2023 10:23 AM
---Advertisement---

Manchu Manoj OTT Show : మంచు మోహన్ బాబు ముద్దుల త‌న‌యుడు మంచు మ‌నోజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పాలి. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. దీంతో చాలా కాలం పాటు కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. ఇటీవలే రెండు సినిమాలను ప్రకటించాడు. మంచు మ‌నోజ్ ఫ్యాన్స్ ఇప్పుడు వాటి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు.మ‌నోజ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ 2017లో రాగా, 2018లో రెండు సినిమాల్లో అతిథి పాత్రలో ఆయన మెరిశారు. మంచు మనోజ్ పనైపోయింది.. ఆయన సినిమాలు చేయడు అని జనం ఫిక్సయిపోయిన తరుణంలో సొంతంగా నిర్మాణ సంస్థను పెట్టి ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమాను ప్రకటించారు. కానీ, ఆ సినిమా ఏమైందో తెలీదు. దాని గురించి కనీసం అప్‌డేట్ లేదు.

ఇక ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ఎలాగు స‌రిగా లేదు, క‌నీసం ప‌ర్స‌న‌ల్ లైఫ్ అయిన బాగుంటుందేమో అనుకుంటే అది కూడా బెడిసి కొట్టింది. మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత మనోజ్ కెరియ‌ర్‌పై పూర్తి దృష్టి పెట్టాడు. త్వ‌ర‌లో ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అనే టైటిల్‌తో ఓటీటీ షోలో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశాడు.

Manchu Manoj OTT Show title is revealed to be launched soon
Manchu Manoj OTT Show

టాక్‌, గేమ్ రెండు షోల‌ను మిక్స్ చేస్తూ టాక్ గేమ్ షోగా ర్యాంప్ ఆడిద్దాం ఉండ‌బోతున్న‌ట్లు మంచు మ‌నోజ్ తెలిపాడు. ఈ షోకు వ‌చ్చే సెల‌బ్రిటీల‌ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడుగుతూ అలానే వారితో స‌ర‌దా గేమ్స్ కూడా ఆడించ‌నున్నట్టు తెలియ‌జేశాడు. ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండ‌గా ఈ షోను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఇక మ‌నోజ్ త్వ‌ర‌లోనే వాట్ ది ఫిష్ అనే సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమాకు వ‌రుణ్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now