Koose Munisamy Veerappan OTT : వీరప్పన్.. ఒకప్పుడు ఈ పేరు చెబితే అందరిలో వణుకు పుట్టేది. నరహంతకుడిగా, ప్రభుత్వాలని గడగడలాడించిన అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అందరిని వణికించాడు. ఆయన రూపం చూస్తే ఎవరికైన భయం కలుగుతుంది. చేతిలో తుపాకీ.. క్రూరత్వమైన వ్యక్తిత్వం కలిగిన బందిపోటు కొన్ని దశాబ్దాలపాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాడు. వీరప్పన్ పూర్తి పేరు.. కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్.. వీరప్పన్ ఎర్ర చందనం, ఏనుగు దంతాల స్మగ్లర్.. తన దురాఘతాన్ని ఎదురించిన ఎందరినో కిడ్నాప్ చేశాడు. ఆయన కిడ్నాప్ చేసిన వారిలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం ఉన్నారు.
కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ ని వీరప్పన్ హత్య చేయడం తెలిసిందే. కోట్లాది రూపాయల విలువైన గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్.. తన స్మగ్లింగ్‌కు అడ్డుగా ఉన్నారని.. 150 మందిని పైగా అతి దారుణంగా చంపాడు.. ఓ అధికారి తల నరికి ఫుట్‌బాల్ కూడా ఆడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2004, అక్టోబర్ 18న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తి జీవితాన్ని, అతని చుట్టూ జరిగిన ఘటనలని తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’తో ఆవిష్కరించబోతున్నారు.
అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5 ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుంది. కూసే మునస్వామి వీరప్పన్‌పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…