Koose Munisamy Veerappan OTT : వీరప్పన్ రహస్య జీవితాన్ని బ‌య‌ట‌పెట్టిన ‘కూసే మునిస్వామి వీరప్పన్’.. ఓటీటీలో ఎప్ప‌టి నుండి అంటే..!

November 26, 2023 4:03 PM

Koose Munisamy Veerappan OTT : వీరప్పన్.. ఒకప్పుడు ఈ పేరు చెబితే అంద‌రిలో వ‌ణుకు పుట్టేది. న‌ర‌హంత‌కుడిగా, ప్ర‌భుత్వాల‌ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత‌ను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అంద‌రిని వ‌ణికించాడు. ఆయ‌న రూపం చూస్తే ఎవ‌రికైన భ‌యం క‌లుగుతుంది. చేతిలో తుపాకీ.. క్రూరత్వమైన వ్యక్తిత్వం కలిగిన బందిపోటు కొన్ని దశాబ్దాలపాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారాడు. వీరప్పన్ పూర్తి పేరు.. కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్.. వీరప్పన్ ఎర్ర చందనం, ఏనుగు దంతాల స్మగ్లర్.. తన దురాఘతాన్ని ఎదురించిన ఎందరినో కిడ్నాప్ చేశాడు. ఆయ‌న కిడ్నాప్ చేసిన వారిలో రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు సైతం ఉన్నారు.

కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ ని వీర‌ప్ప‌న్ హ‌త్య చేయ‌డం తెలిసిందే. కోట్లాది రూపాయల విలువైన గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేసిన వీరప్పన్.. తన స్మగ్లింగ్‌కు అడ్డుగా ఉన్నారని.. 150 మందిని పైగా అతి దారుణంగా చంపాడు.. ఓ అధికారి తల నరికి ఫుట్‌బాల్ కూడా ఆడినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే 2004, అక్టోబర్ 18న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అయితే ఇప్పుడు ఆయ‌న పూర్తి జీవితాన్ని, అత‌ని చుట్టూ జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ని తమిళ్ ఒరిజినల్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’తో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

Koose Munisamy Veerappan OTT know the  streaming details
Koose Munisamy Veerappan OTT

అడవుల్లోకి పారిపోయి తలదాచుకున్న బందిపోటు దొంగ కూసే మునస్వామి వీరప్పన్ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సదరు బందిపోటు దొంగకు సన్నిహితులైన వారి నుంచి వివరాలను సేకరించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5 ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అతని పూర్తి జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అతని చుట్టూ జరిగిన ఘటనలను గురించి కూడా తెలియజేస్తుంది. కూసే మునస్వామి వీరప్పన్‌పై ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన దృక్పథం ఏర్పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now