Kirak RP : జబర్ధస్త్ వీక్షించిన వారికి కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కొన్నాళ్లు జబర్ధస్త్‌లో తన కామెడీతో ఎంతగానో అలరించిన ఆర్పీ బయటకు వచ్చి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్‌ను ఓపెన్ చేసాడు. దీనికి మంచి గిరాకీ ఉండడంతో ఆ తర్వాత మణికొండ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. ఇటీవలే నెల్లూరులోనూ చేపల పులుసు పెంటర్ ప్రారంభించాడు. ప్రముఖ నటి, మంత్రి రోజా చేతుల మీదుగా ఈ కర్రీ పాయింట్ ఓపెనింగ్ అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.
అయితే కిర్రాక్ ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్నను ఘనంగా పెళ్లాడారు. వీరి వివాహ వేడుక విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. వైజాగ్‌లో సముద్ర తీరాన వీరి పెళ్లి జరగగా, మేలో హైదరాబాద్ వేదికగా నిశ్చితార్థం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వీరి పెళ్లి జరిగింది. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.అయితే కిర్రాక్ ఆర్పీ గతంలో తనది లవ్ ఎట్ ఫట్ సైట్ అని అన్నాడు. ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో మొదటిసారి చూశానని.. చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పిన ఆర్పీ, ఆమె ఫోన్ నెంబర్ అడిగారట. అప్పుడు ఆమె తన తల్లి ఫోన్ నెంబర్‌ను ఆర్పీకి ఇచ్చారట.
మొదట లక్ష్మీ ప్రసన్న తల్లిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న ఆర్పీ ఆమెతో అనుబంధం కొనసాగించారట. ఏడాది తర్వాత తన ప్రేమ విషయాన్ని లక్ష్మీ ప్రసన్న తల్లికే చెప్పారట. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో వారి పెళ్లికి మొదట నో చెప్పిన ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న చేసిన ఫైట్ వలన కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక 2020లో దర్శకుడిగా మారిన ఆర్పీ తన తొలి సినిమాను ప్రకటించారు. జేడీ చక్రవర్తి హీరోగా సినిమా ప్రారంభించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతుందని ప్రకటించిన ఈ సినిమా ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…