Karimnagar’s Most Wanted OTT Release Date : పొలిటికల్ క్రైమ్ డ్రామా కరీంనగర్స్ మోస్ట్‌ వాంటెడ్‌ వెబ్ సిరీస్ ఓటీటీ డేట్ లాక్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

December 22, 2023 10:39 PM

Karimnagar’s Most Wanted OTT Release Date : ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమాలు ఓటీటీలో తెగ సంద‌డి చేస్తున్నాయి. అలానే తెలుగు వెబ్ సిరీస్‌లు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. సైతాన్‌, అతిథి వధువు, ధూత, వ్యూహం తదితర తెలుగు వెబ్‌ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించ‌గా, ఇప్పుడు అదే జాబితాలో వ‌చ్చింది కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఇందులో చాలా న‌టించిన వారు అంద‌రు దాదాపు కరీంన‌గ‌ర్‌కి చెందిన వారే. షూటింగ్ కూడా క‌రీంన‌గ‌ర్‌లోనే జ‌రిగింది. తెలంగాణ నేపథ్యంలో పక్కా లోకల్‌ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ కి బాలాజీ భువనగిరి దర్శకత్వం వ‌హించారు. సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీలు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇందులో ఉన్న‌ ‘కరీంనగర్ వాలే’ సాంగ్‌ చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌ లో రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది. ట్రైలర్‌ కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేరాలు, లోకల్ పాలిటిక్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ డిసెంబర్ 22వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానున్న‌ట్టు ఆహా అధికారంగా వెల్లడించింది. “ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా లోకల్ పాలిటిక్స్ డ్రామా డిసెంబర్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలియ‌జేశారు. సస్పెన్స్, డ్రామా, కుట్రలను మిస్ కావొద్దని ఆహా వారు తెలియ‌జేశారు.

Karimnagar’s Most Wanted OTT Release Date
Karimnagar’s Most Wanted OTT Release Date

ఈ వెబ్ సిరీస్‌కు సంకీర్త్ రాహుల్ కెమరామేన్‌గా పనిచేశారు. ఆయన విజువల్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని షాట్స్ సినిమా మేకింగ్‌ను గుర్తుచేస్తున్నాయి. ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం సమకూర్చారు. ఎస్.అనంత్ శ్రీకర్ నేపథ్య సంగీతం అందించారు. ‘బలగం’ ఫేం రచయిత రమేష్ ఎలిగేటి ఈ సిరీస్‌కు కథా, కథనం, సంభాషణలు అందించారు. ‘బలగం’ ఫ్యామిలీ డ్రామా అయితే దానికి పూర్తి భిన్నమైన పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ అని చెప్ప‌వ‌చ్చు. ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్స్‌లో నటీనటులంతా కరీంనగర్ యాసని అద్భుతంగా పల‌క‌డం కొస‌మెరుపు. మ‌రి రేపు రానున్న ఈ వెబ్ సిరీస్‌ని అస్స‌లు మిస్ కావొద్దు.జిల్లాలోని క్రిమినల్ వరల్డ్, రాజకీయాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now