Amigos : క‌ల్యాణ్ రామ్ మూవీ అమిగోస్ ఓటీటీలో.. ఎందులో అంటే..?

February 11, 2023 9:19 PM

Amigos : బింబిసార చిత్రం త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ న‌టించిన చిత్రం అమిగోస్. ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం ఒక పాత్రకు మరో పాత్రకు ఏ మాత్రం సంబంధం లేదని ముందు నుంచే ప్రచారం చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

సుమారు 11 కోట్ల మేర ఈ సినిమా హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లకు అమ్మారు. కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌గా, ఇందులో కళ్యాణ్ రామ్ బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్, సిద్ధార్థ, మంజునాథ హెగ్డే అనే మూడు భిన్నమైన పాత్రలలో నటించారు. మూడు పాత్ర‌ల‌లో త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో మెప్పించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

kalyan ram latest movie Amigos on ott know the app
Amigos

ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్ రానుంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. అమిగోస్ చిత్రంలో ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ బాగుండడం గమనార్హం. సరికొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులు వస్తాయిగాని పాటను ఆమిగోస్ లో రీమిక్స్ చేయ‌గా, ఈ పాటకి వేటూరి సుందర రామమూర్తి లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాట‌కి థియేట‌ర్స్‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now