Jyothi Rai : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎనిమిదో సీజన్ జరుపుకుంటుంది. అయితే ఈ సారి ఎక్కువగా యూత్‌కు, సీరియల్ యాక్లర్లకు పెద్ద పీట వేశారు. భారీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు షోలోకి వచ్చారు. అయితే రెగ్యులర్ టెలివిజన్ ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీలను సిద్దం చేస్తున్నది. అయితే సోషల్ మీడియానే కాకుండా తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకురానున్నారనే టాక్ నడుస్తుంది.
బిగ్ బాస్ కు సంబంధించి ఇప్పటిదాకా ప్రసారమైన ప్రతి సీజన్లోనూ వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది హాట్ టాపిక్కే. కానీ ఆ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ సడన్ గా ఎలా వస్తారో అంతే ఫాస్ట్ గా బయటకు వెళ్లిపోతారు కూడా. ఈ సీజన్లో కూడా ఓ బో*ల్డ్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లితెర హాట్ బాంబ్ జ్యోతి రాయ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి, ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ఆమె సినిమాల కోసం ఊహించని రేంజ్ లో హాట్ షో చేసి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. అలాగే ఓ యంగ్ డైరెక్టర్ ను రెండవ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.
ఈ నేపథ్యంలో ముందుగానే ఆమెను బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా తీసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో వెళ్లలేదని జ్యోతి స్వయంగా వెల్లడించింది. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమెను హౌజ్ లోకి పంపుతున్నారని ప్రచారం జోరందుకుంది. కానీ ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ పెట్టే వీడియోలు, రీల్స్, స్టేటస్, ఫోటోలు ఆలోచింప జేసేలా, ఆకట్టుకొనేలా ఉంటాయి. తన అందచందాలను, ఘాటైన గ్లామర్‌ను తన ఫ్యాన్స్‌కు అందజేస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో క్రేజీగా మారుతున్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ మధ్యకాలంలోనే దర్శకుడు సుక్కును వివాహం చేసుకొన్న జ్యోతిరాయ్.. తన భర్త రూపొందించే పాన్ ఇండియా మూవీలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే మరో సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…