వామ్మో.. ఎన్‌టీఆర్‌కు ఇలా కోపం రావడాన్ని ఎప్పుడూ చూసి ఉండ‌రు.. సుమ‌ను ఏమ‌న్నాడంటే.. వీడియో..

February 6, 2023 5:57 PM

ట్రిపుల్ ఆర్ సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో మీడియాలో ఎక్కువ‌గా క‌నిపించిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించ‌లేదు అయితే ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్స‌ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యాడు. ఆరోగ్యం బాగోలేక‌పోయిన కూడా అన్న‌య్య కోసం ఓపిక చేసుకొని వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ చెప్పింది. అయితే అది చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది,

ఎన్టీఆర్ స్పీచ్‌కి ముందు మాట్లాడేట‌ప్పుడు ఎన్టీఆర్ త‌న 30వ చిత్రం అప్‌డేట్ ఇస్తారంటూ మాట్లాడింది సుమ‌. ఆమె అలా మాట్లాడుతున్న‌ప్పుడు ఎన్టీఆర్ సుమ వైపు చాలా సీరియ‌స్‌గా చూశాడు. అయితే ప‌క్క‌నే ఉన్న క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ని కూల్ చేయ‌టంతో తార‌క్ సైలెంట్ అయిపోయారు. అయితే తాను మాట్లాడుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్‌కి ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ‘‘సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. దర్శక నిర్మాతలకు ఒత్తిడిని పెంచకండి. దాంతో నష్టం కలుగుతుంది. అప్డేట్ ఉంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం.

jr ntr very angry on anchor suma see what he said video

మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఈరోజు మంచి రోజు కాబట్టి చెబుతున్నాను. ఫిబ్రవరిలో సినిమా ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఏదోలా త‌న సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అయితే ఇచ్చ‌డు కాని సుమ ప్ర‌వ‌ర్తించిన తీరు మాత్రం ఎన్టీఆర్‌కి చాలా కోపం తెప్పించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం సుమ‌పై ఎన్టీఆర్ చూపించిన రియాక్ష‌న్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now