Jabardasth Rakesh : నేను స్మశానంలో ఎక్కువగా ఉండేవాడిని.. నా కోసం అక్క‌డికి కూడా సుజాత వ‌చ్చేద‌న్న రాకేష్‌

November 20, 2023 9:47 PM

Jabardasth Rakesh : జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒక‌రు. చిన్న పిల్ల‌ల‌తో ఎక్కువ‌గా స్కిట్లు చేసి తన కామెడీతో ప్రేక్షకులను అల‌రించాడు రాకేష్‌. రీసెంట్‌గా ఆయ‌న‌ కేసీఆర్ అనే మూవీని తీశాడు. ఎన్నికల కారణంగా సెన్సార్ నిలిపివేశారు. ఈ ఎన్నికలు ముగిశాక ఆ చిత్రం థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా, చిత్రాన్ని రెండు మూడు రోజుల్లో విడుదల చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమా ఈ టైంలో రిలీజ్‌ చేయాలని రాకేష్‌ చాలా కష్టాలు పడ్డాడు. అయితే, రాకింగ్‌ రాకేష్‌కు ఈసీ షాక్‌ ఇచ్చింది. సినిమా విడుదల వాయిదా పడింది.

ఇక ఈ ఖాళీ స‌మ‌యాన్ని త‌న సినిమాని ప్రమోషన్స్ కోసం వాడుకుంటాను అని రాకేష్ చెప్పుకొచ్చాడు. ఈ క్ర‌మంలో తాజాగా తన పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. మాది వ‌రంగ‌ల్ కాగా, మా ఊరి ప‌క్క‌న సుజాత వాళ్ల‌ది. అలా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం సాగింది. ఇంటర్వ్యూ కోసం ఓ సారి ఆమె పని చేసిన ఛానెల్‌కు వెళ్లాను.. అక్కడ మ‌రింత ప‌రిచయం ఏర్ప‌డింది. అప్పుడ‌ప్పుడు ఇద్ద‌రం క‌ష్ట‌సుఖాలు గురించి మ‌ట్లాడుకునే వాళ్లం. త‌ను త‌న జీవితంలో ఎన్నో స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసింది. అయితే త‌న బాధ‌ల‌ని చూసి నేను మ‌ణికొండలో నా ఇంటి ప‌క్క‌న ఆమెకి ఓ ఇల్లు చూశాను. అమ్మ‌తో మంచిగా ఉండేది. ఆమెని పెళ్లి చేసుకోవాల‌ని ఆలోచ‌న లేదు.

Jabardasth Rakesh intreresting comments on sujatha
Jabardasth Rakesh

మొద‌టి నుండి నాకు పెళ్లిపైన అంత ఆస‌క్తి ఉండేది కాదు. మా గురువు రాళ్లపళ్లి చనిపోయిన తరువాత నేను ఎక్కువగా ఆయన సమాధి ద‌గ్గ‌ర ఉండేవాడిని. స్మశానంలోనే ఎక్కువ‌గా ఉండేవాడిని. అప్పుడు నా కోసం ఆమె స్మ‌శానానికి కూడా వ‌చ్చేది. మా పెళ్లికి అంతా ఆమె క‌ష్ట‌ప‌డి చేసింది. వాళ్ల ఇంట్లో వాళ్ల‌ని ఒప్పించి పెళ్లి కార్య‌క్ర‌మాల‌ని ద‌గ్గ‌రుండి చూసుకొని చాలా క‌ష్ట‌ప‌డింది. నేను వేరే వాళ్ల పెళ్లికి వెళ్లిన‌ట్టు సింపుల్‌గా వెళ్లాను. త‌ను చాలా మంచిది అని రాకేష్ అన్నాడు. ఇక ఓ సారి న‌న్ను జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోమని చెప్పారు.ఎవరో చెప్పిన మాటలు విని నన్ను బయటికి గెంటేసారు. అప్పుడు నిజ‌నిజాలు తెలుసుకొని నన్ను అనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.ఆ తర్వాత వాళ్లే నిజం తెలుసుకొని మళ్లీ నన్ను జబర్దస్త్ కి పిలిపించారు అని తెలిపారు రాకేష్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now