Jabardasth Naresh : జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

March 3, 2023 8:14 AM

Jabardasth Naresh : జబర్దస్త్ నరేష్ చూడటానికి మూడు అడుగుల లోపే ఉన్నా సంచుల కొద్దీ పంచులు వేస్తూ చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం బుల్లితెర మీద నరేష్ ఒక వెలుగు వెలుగుతున్నాడనే చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నరేష్ ఏకసంతాగ్రహి. అది భగవంతుడు ఇచ్చిన వరం. స్క్రిప్ట్, కాన్సెప్ట్ ఏమిటి అని ఒక‌సారి చూసుకుని పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని భాస్కర్ కూడా చాలా సార్లు చెప్పాడు.

ప్రస్తుతం కొన్ని రోజులుగా జబర్దస్త్ నరేష్ వయసు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లో అనంతపురం అనే ఊరిలో పుట్టిన నరేష్ చిన్నతనం నుండి ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాడు. 10 సంవత్సరాల పిల్ల‌వాడిగా కనిపించే నరేష్ వయస్సు 24 సంవత్సరాలు. ఢీ షో జూనియర్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట తిరుగుతూ ఉంటే సునామి సుధాకర్ చంటి టీమ్ లో జాయిన్ చేశాడు.

Jabardasth Naresh real age you will be surprised to know
Jabardasth Naresh

ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. జబర్దస్త్ షో కి వచ్చాక సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవడమే కాకుండా సిటీ లో కూడా ఒక ఫ్లాట్ తీసుకున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now