Indian 3 Movie : ఇండియ‌న్ 3 కూడా రానుంది.. మ‌రి అందులో హీరో ఎవ‌రంటే..!

November 13, 2023 9:43 AM

Indian 3 Movie : ఇటీవ‌లి కాలంలో ఒక సినిమా హిట్ అయితే దానికి అనుబంధంగా రెండు మూడు పార్ట్‌లు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు మేక‌ర్స్. అయితే తొలి పార్ట్ హిట్ అయినంత సీక్వెల్స్ విజ‌యాలు చ‌విచూడ‌డం లేదు. ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకోవడం.. రెట్టింపు ఆదాయం తెచ్చింది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’తొలి పార్ట్ మంచి విజ‌యం సాధించ‌డంతో దాని క‌థ‌కి అనుబంధంగా రెండో భాగం చేస్తున్నారు.అలానే ఇండియ‌న్న చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 కూడా రూపొందుతుంది. ప్ర‌స్తుతం దక్షిణాదిన తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ కూడా అంతటితో ఆగిపోదట. దానికి కూడా మూడో భాగం ఉంటుందట. ఈ విషయం ‘ఇండియన్-2’లో నిర్మాణ భాగస్వామి అయిన ఉదయనిధి స్టాలిన్ స్వయంగా వెల్లడించాడు. ‘ఇండియన్-3’ ఉంటుందని ఇంతకుముందే ప్రచారం జరిగింది. కానీ దానిపై క్లారిటీ లేదు.

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఉద‌య‌నిధి ఇండియన్-2’ ఫుటేజ్ చాలా ఎక్కువగా వచ్చిందని.. దీని కథ విస్తృతి ఎక్కువ అని.. కాబట్టి ‘ఇండియన్-3’ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు కమల్ హాసన్ కొత్తగా 40 రోజుల డేట్లు ఇచ్చాడని.. షూటింగ్ జరుగుతోందని.. శంకర్, కమల్ ఇద్దరూ కూడా ఔట్‌పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారని.. ఈ సినిమాకు మూడో భాగం చేసే అవకాశాలు కచ్చితంగా ఉంటాయ‌ని అత‌ను చెప్పుకొచ్చాడు. ఇక ఇండియన్-2 వచ్చే ఏప్రిల్లో రిలీజవుతుందని ఉదయనిధి స్ప‌ష్టం చేశాడు. ఇండియన్-2కు ఒక చోట బ్రేక్ ఇచ్చి.. ఇందులో మిగిలిన కంటెంట్‌కు మరికొంత జోడించి ఇండియన్-3ని సెట్ చేయాలన్నది శంకర్ ఆలోచనగా తెలుస్తుంది.

Indian 3 Movie may be launching soon
Indian 3 Movie

అనుకున్న దాని క‌న్నా కూడా మ‌రో 40 రోజులు ఎక్కువ ప‌ని చేస్తే ఇండియ‌న్ 2, ఇండియ‌న్ 3 కూడా పూర్తి అవుతాయ‌ని ,ఈ మేర‌కు లైకా సంస్థ‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిగినట్టు స‌మాచారం. ఇదే నిజ‌మైతే ఇండియన్-3ని కూడా వచ్చే ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలని కూడా శంకర్ భావిస్తున్నట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం శంక‌ర్ .. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. మ‌రి ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు. ఇండియ‌న్ 2, ఇండియన్ 3 చిత్రాల‌కి ఎప్పుడు గుమ్మ‌డికాయ కొడ‌తాడు అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now