Hi Nanna OTT Release : ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన హాయ్ నాన్న‌.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి అంటే..!

December 26, 2023 1:23 PM

Hi Nanna OTT Release : నేచుర‌ల్ స్టార్ నాని ద‌స‌రా చిత్రంతో అతి పెద్ద విజ‌యం సాధించి అదే జోష్‌తో హాయ్ నాన్న మూవీతో ప‌ల‌క‌రించాడు. శౌర్యూవ్ దర్శకత్వంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ మూవీకి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. ఇదే అన్ని ఏరియాల్లోనూ కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభించింది. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య సాగె ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎప్పటిలానే నాని తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

హాయ్ నాన్న సినిమాకు యూఎస్‌లో కూడా మంచి కలెక్షన్స్ దక్కాయి.అయితే థియేట‌ర్‌లో మిస్ అయిన వాళ్లు ఈ సినిమాని ఓటీటీలో చూడాల‌ని ఫ్యాన్స్ ఎప్ప‌టి నుండో ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా హాయ్ నాన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. హాయ్ నాన్న ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంద‌ని తెలుస్తుండ‌గా, జనవరి 12 అంటే సంక్రాంతికి ఈ సినిమాను ఓటీటీలోకి వదిలే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తున్న స‌మ‌యంలో హాయ్ నాన్న ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌లా అల‌రిస్తుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Hi Nanna OTT Release know the platform and streaming details
Hi Nanna OTT Release

హాయ్ నాన్న’ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. చిత్రంలో బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్రను పోషించింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now