వినోదం

Guppedantha Manasu November 11th Episode : రిషి, వ‌సుధార‌.. బుంగ‌మూతి, బుజ్జ‌గింపులు, శైలేంద్ర‌కు వసు బ్రేక్‌, దేవ‌యానికి వార్నింగ్‌..

Guppedantha Manasu November 11th Episode : వ‌సుధారకి రిషి చెవికమ్మలు గిఫ్ట్ గా ఇస్తాడు. అవి కిందపడిపోతాయి. రిషికి కనిపిస్తాయి. అత‌ను వాటిని తీసి దాచిపెడ‌తాడు. ఏమీ తెలియ‌న‌ట్లు కొంచెం సేపు ఆటపట్టిస్తాడు. ఎంతో ప్రేమగా తీసుకొచ్చా క‌దా, ఎందుకిలా అయిందని రిషి అంటాడు. కచ్చితంగా దొరుకుతాయ‌ని ఆమె అంటుంది. ఎప్పటికీ దొరక‌వు, దీంతో వ‌సుధార‌.. పోనీలెండి వాటిని పెట్టుకునే అదృష్టం నాకు లేదు, అవి అందుకే దొరకడం లేదు అని అంటుంది. దీంతో రిషి ఆ రింగుల‌ని చూపిస్తాడు. దీంతో ఆమె సంతోషపడుతుంది. అంటే మీ దగ్గర దాచేసి నన్ను ఆటపట్టించారు క‌దా మీరు, దొంగ సార్ అంటుంది. నన్ను ఏడిపించారు కదా అంటుంది. ఇది ఏడిపించడం కాదు, నా చిలిపి జ్ఞాపకం అని అంటాడు రిషి. ఇప్పటివరకూ మనకున్న దూరం తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ మనం రిషిధారలం అయ్యాం అని అంటాడు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ రిషి తాను తెచ్చిన రింగుల‌ను వసు చెవుల‌కి పెడతాడు. అలా ఇద్దరూ కాసేపు సంతోషంగా గ‌డుపుతూ సెల్ఫీ తీసుకుంటారు.

అనుపమ విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది. నీకు ఇక్కడ అంతా ఓకేనా అమ్మ అనడంతో బాగానే ఉంది డాడ్ అని అంటుంది. డాడీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చా. నేను ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నా.. అనడంతో ఏం ఫంక్షన్ అని అడుగుతాడు విశ్వనాథం. మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలుస్తాన‌నడంతో సరే అని ఓకే చెబుతాడు విశ్వనాథం. ఫ్రెండ్స్ ని కలవడం చాలా మంచిది వాళ్ళని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు వచ్చి మనస్సు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంద‌ని అంటాడు. కొంతమంది నంబర్స్ ఉన్నాయి మరి కొంతమంది నంబర్స్ లేవు, అద‌దర్నీ క‌ల‌వాలి, నా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటాడు విశ్వనాథం.

రిషి వసుధార ఒడిలో తల పెట్టుకుని పడుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పు వసుధార, నేను ఏంజెల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు కదా అనడంతో, అవును సార్ అని అంటుంది. మా ఇద్దరి మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని అడగడంతో ముందు పైకి లేవండి సార్ అని అలిగి పక్కకు వెళ్లి నిలబడుతుంది వసుధార. ఏమైంది అలా వెళ్ళిపోయావు అనడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ మాట వేరే వాళ్ళు కనుక అడిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని బుంగమూతి పెడుతుంది వసుధార. మీ మీద నాకు ప్రేమ తప్ప మరో ఆలోచన లేదు మిమ్మల్ని అనుమానిస్తే ఈ వసుధార అసలు వసుధారే కాదనడంతో రిషి సంతోషిస్తాడు. అయినా వసు బుంగమూతి పెట్టడంతో బెడ్ పైకి ఎక్కి, వసుధారా సారీ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మావయ్య వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయనంటుంది వసుధార. అయితే టెర్రస్ పైకి ఎక్కి గట్టిగా అరిచి చెబుతానంటాడు. వద్దులెండి మీ సారీ యాక్సెప్ట్ చేస్తాననడంతో రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు.

Guppedantha Manasu November 11th Episode

మరొకవైపు ఫణీంద్ర పేపర్ చదువుతుండగా ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. నేను లేనప్పుడు వచ్చి డాడ్ ని కలిసి వెళ్లారంట అంటాడు రిషి. నా మనసంతా ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. నేను మీ డాడీ మీ ఇంటికి రమ్మని పిలిచాను. ఎన్ని సార్లు అడిగినా రాను అన్నాడు. అందుకే నేను బలవంతం చేయలేదు, పెద్దనాన్న మీరు ఏమీ అనుకోకపోతే అప్పుడప్పుడు వచ్చి డాడ్ ని పలకరించి వెళ్తారా అనడంతో తప్పకుండా రిషి, నా తమ్ముడిని బాగు చేసుకోవడం నా బాధ్యత అని అంటాడు. ఇంతలో దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు శైలేంద్ర ఫోన్ తీసుకొని రిషితో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తాడు. అప్పుడు శైలేంద్ర అసలు విషయం రాబట్టడం కోసం మొన్న మేము వచ్చినప్పుడు మీరు లేరు ఎక్కడికి వెళ్లారు రిషి అని అడుగుతాడు. అప్పుడే వచ్చిన వసుధార, మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారని చెప్పి ఫోన్ తీసుకుని రిషిని పంపించేస్తుంది.

వసుధార అంటూ.. రిషి సార్ ని ఏమడుగుతున్నారు, శైలేంద్ర ఏమీ లేదంటాడు, మీ బుద్ధులన్ని నాకు తెలుసు సార్ ప్రేమగా నటిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు మొన్న వచ్చినందుకు సంతోషం ఎందుకంటే పెద్ద మామయ్య వాళ్ళు చిన్న మామయ్య సంతోషంగా ఉంటారు కానీ మీరు రావడం వల్ల మాకు సంతోషం దూరం అవుతుంది అని వసుధార అన‌డంతో దేవయాని షాక్ అవుతుంది. ధరణి మేడంని కూడా మీతో పాటూ తీసుకొస్తే బాగుండేది, ధరణి మేడం భూషణ్ ఫ్యామిలీ మెంబర్ అని అనుకోవడం లేదా, స్త్రీని గౌరవించడం తెలియని మీరు ఓ కాలేజీని ఎలా నడపగలరు శైలేంద్ర గారు, జీవితంలో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముందు అవి నేర్చుకోండి, అంతే కానీ కాలేజీ జోలికి రావొద్దు అంటుంది.

మా గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావా అని దేవ‌యాని అంటుంది. అందుకు వసు అరవకండి మేడం, ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంది. అప్పుడు దేవయాని శైలేంద్రతో పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దు అంటుంది. భార్య-భర్త బాగుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోరు, కానీ నా తోడి కోడలు బాధపడితే చూస్తూ ఊరుకోలేను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వ‌సు అంటుంది. దేవయాని-శైలేంద్ర షాక‌వుతారు. ఎపిసోడ్ ముగుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM