వినోదం

Guppedantha Manasu January 3rd Episode : వ‌సుధార‌ కిడ్నాప్.. శైలేంద్ర ప్లాన్ సక్సెస్..!

Guppedantha Manasu January 3rd Episode : రిషి తో ఫోన్ లో మాట్లాడాక వసుధారా కలవడానికి వెళుతుంది. ఆమెని సీక్రెట్ గా రౌడీలు ఫాలో అవుతా ఉంటారు. ఆ విషయాన్ని గమనించి, రౌడీలకి మస్కా కొట్టి రిషి ని కలుస్తుంది. లేవలేని స్థితిలో ఉన్న రిషి ని చూసి ఎమోషనల్ అయిపోతుంది వసుధారా. రిషి గుండెల పై వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా చూడడం బాధ ఉందని చెప్తుంది. అన్ని రోజులు మనవి కాదు కదా అని వసుధారని ఓదారుస్తాడు రిషి. నలుగురి బాగు కోరుకునే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని వసుధారా అంటుంది. చాలా భయపడ్డానని, ఇన్నాళ్లు ఎంతో బాధపడ్డాను అని రిషితో చెప్తుంది వసుధారా. మహేంద్ర కూడా మీ మీద బెంగతో ఉన్నారు. మీకోసం వెతకని చోటు లేదు. మీ ఆచూకీ కోసం మేము అడగని మనిషి లేడు అని చెప్తుంది.

ఎంత వెతికినా మీరు కనిపించలేదని చెప్తుంది. మీరు కనిపించడం లేదని, పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని రిషితో చెప్తుంది. అతను కనపడకుండా పోయిన రోజు ఏమి జరిగిందని చెప్తుంది వసుదారా. చివరికి హాస్పిటల్ లో డెడ్ బాడీ మీదే ఏమో అని కంగారు పడిపోయానని చెప్తుంది. కనపడకుండా పోయిన తర్వాత, కాలేజీకి సరిగ్గా వెళ్లడం లేదని, బోర్డు మీటింగ్లకు కూడా వెళ్ళట్లేదని అంటుంది. నేను కనిపించకుండా పోతే ఎంత జరిగిందో, ఒకవేళ నాకు ఏమైనా అయితే అని రిషి అంటాడు. ఆ మాట అనొద్దు అని రిషి నోరు మూస్తుంది వసుధారా.

మీరు చాలా మంచి వాళ్ళు. మీకేం కాదు. మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను అని వసుధార అంటుంది. రిషి ని కాపాడిన వాళ్ళకి దండం పెడుతుంది. రిషి కిడ్నాప్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. అదే ప్రశ్న రిషి ని అడుగుతుంది కానీ, అప్పుడే రిషి నొప్పితో బాధ పడతాడు. మహేంద్ర ని భోజనం చేయమని అనుపమంటుంది. కానీ వద్దని చెప్తాడు. రిషి కనపడలేదు. అతడు ఎక్కడున్నాడో ఇంతవరకు తెలియలేదు. ఇప్పుడు వసుధారా కూడా కనబడలేదు అని మహేంద్ర బాధపడతారు. ఇలాంటి పరిస్థితుల్లో భోజనం ఎలా చేయగలనని అంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఊపిరి ఆగిపోయేలా ఉంది అని ఎమోషనల్ అయిపోతాడు. మహేంద్ర కి ధైర్యం చెప్తుంది అనుపమ.

Guppedantha Manasu January 3rd Episode

నీకు తోడుగా నేను ఉన్నాను. ఆ ధైర్యం తోనే వసుధారా బయటికి వెళ్లి ఉంటుందని అనుపమంటుంది. నేనేం సమాధానం చెప్పాలి. అనుపమ ఒట్టు వేసే సరికి మహేంద్ర తింటాడు. రిషి వసుధారా ని ఎలాగైనా పట్టుకోవాలని రౌడీలు అనుకుంటారు. మరోవైపు రిషి కి తైలం రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషిలో చాలా హుషారు వచ్చిందని పెద్దమ్మ చెప్తుంది. ఈరోజు రిషి ముఖం చాలా వెలుగుతోందని అంటుంది. తర్వాత వసుధారా చేయి కడుక్కోవడానికి బయటకి వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన రౌడీలు వసుధారని కిడ్నాప్ చేస్తారు. ఫోన్ ఇవ్వడానికి పెద్దమ్మ వస్తుంది కానీ బయట వసు కనపడకపోయేసరికి, కంగారు పడుతుంది.

వసుధారను ఎలా అయినా కాపాడుకోవాలని, రిషి అనుకుంటాడు. కిడ్నాప్ చేసి రౌడీలు ఆమెని కట్టేస్తారు. ఆ విషయం శైలేంద్ర కి ఫోన్ చేస్తే చెప్తారు రౌడీలు. వీడియో కాల్ చేసి వసుధారని చూపిస్తారు. తను వచ్చేవరకు వసుధారాను ఒక కంట కనిపెట్టమని చెప్తాడు. వసుధారా నన్ను కొట్టిన చెంప దెబ్బకి ఇన్నాళ్లకు నాకు చేసిన అవమానాలకు బదులు తీర్చుకుంటున్నానని, తల్లితో శైలేంద్ర చెప్తాడు. వసుధారా ని కిడ్నాప్ చేసిన విషయం మాత్రం దేవయానికి చెప్పాడు. శైలేంద్ర బయటకి వెళ్లబోతుండగా ధరణి అడ్డుపడుతుంది నేను కూడా మీతో వస్తానని అంటుంది. శైలేంద్ర వద్దంటాడు. పోనీ అత్తయ్యనైనా తీసుకెళ్లండి. మీ గాయాలు పూర్తిగా తగ్గలేదని శైలేంద్ర కి సలహా ఇస్తుంది ధరణి.

నేను ఒంటరిగానే వెళ్లాలని, తనతో పాటు ఎవరూ రావద్దని కోప్పడతాడు. అర్జెంట్ పని అని, బయటకి వెళ్ళిన ప్రతిసారి డిసప్పాయింట్ అవుతూ వస్తున్నారు. రివర్స్లో అన్ని జరుగుతున్నాయి ఇది కూడా అలాగే అవుతుందని అనిపిస్తుందని ధరణి అంటుంది. ఈసారి అలా ఏం కాదు. కంగారు పడకుండా హ్యాపీగా కిచెన్ లో పనిచేసుకోమని చెప్తాడు శైలేంద్ర ఏదో ప్లాన్ వేసినట్టు ధరణికి అర్థమవుతుంది ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM